గుండాల జనవరి 21 (మన్యం మనుగడ) గుండాల పంచాయతీకి పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసిన పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. పల్లె ప్రగతి లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండల పర్యటించి అంతర్గత రహదారుల కోసం నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మంజూరు చేసిన నిధులను ప్రభుత్వ విప్ రేగా శుక్రవారం మండలం లో పర్యటించి మండల కేంద్రంలో 6 సిసి రోడ్లను మంజూరు చేశారు. కన్నాయిగూడెం ఒకటి , కోనేరు గూడెం ఒకటి, వేపల గడ్డ ఒకటి, జమరగుడెంఒకటి, మాటం లంక ఒకటి, గలభ ఒకటి, లక్ష్మీపురం ఒకటి, జగ్గయ్య గూడెం రెండు సిసి రోడ్లను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కోలేటి భవాని శంకర్ ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య , టిఆర్ఎస్ నాయకులు మోకాళ్ళ వీరస్వామి, అబ్దుల్ నబి, సర్పంచులు సమ్మయ్య, అజ్మీరా మోహన్, నరసింహారావు, టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు , గడ్డం రమేష్ , అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: