మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని వంద పడకల ఆసుపత్రిలో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 7వ విడత ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ట్రస్టు చైర్మన్ రేగా కాంతారావు తెలిపారు.పరీక్షలు నిర్వహించి,శస్త్ర చికిత్స అవసరమైన వారికి హైదరాబాద్ కు కంటి ఆపరేషన్ కోసం పంపించడం జరుగుతుంది అన్నారు.కంటి ఆపరేషన్ చేయించుకునే వారు జనవరి 21 వ తేదీన మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో హాజరుకావాలని ఆయన తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, రేగా కాంతారావు కోరారు.
Post A Comment: