CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

50 వేల కోట్ల రైతు బంధు విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది.సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు: టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు

Share it:

 





మన్యం టీవీ మణుగూరు: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో తిర్లాపూరం, రామనుజవరం గ్రామ పంచాయతీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మొదటి విడత రైతు బంధు,రైతుల అకౌంట్ లలో జమ ఐన సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ముత్యంబాబు మాట్లాడుతూ,టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు.రైతు బంధు,రైతు భీమా లాంటి పథకాలు లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.ఎటువంటి పైరవీలు లేకుండా నేరుగా రైతుల అకౌంట్ లో రైతు బంధు జమ అయ్యే లా పథకాన్ని రూపొందించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని,ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్, లాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి,అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు, టిఆర్ఎస్ ప్రభుత్వం కు దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామి రెడ్డి, మాజి డిసిసిబి డైరెక్టర్. బోయిళ్ళ రమణయ్య. మత్స్యకార సంఘం జిల్లా డైరెక్టర్ చీడెం.నాగేశ్వరావు, తీర్లపురం ఉప సర్పంచ్ కంటెం సురేష్,రామానుజవరం ఉపసర్పంచ్.తడకమళ్ళ ప్రభుదాస్,టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు రమాదేవి,టిఆర్ఎస్ పార్టీ గ్రామపంచాయతీ అధ్యక్షులు. పెండ్యాల.నాగేశ్వరరావు, బొగ్గుల నాని,రైతు నాయకులు బత్తిని చందర్రావు,తోటకూరి కోటయ్య,యువజన నాయకులు బోయిళ్ళ రాజు, మండారి సతీష్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: