CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

5వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం.50 మందిని కంటి ఆపరేషన్ కై ప్రత్యేక బస్సులో హైదరాబాద్ కు తరలించిన విప్ రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలను మరింత విస్తరింపజెస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు తెలిపారు.ఈ మేరకు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి పరీక్షలు చేసి నిర్ధారించారు.50 మందికి భోజన సదుపాయం కల్పించి, వారిని ప్రత్యేక బస్సుల లో హైదరాబాద్ కు దగ్గరుండి పంపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా చికిత్సకు హైదరాబాద్ వెళ్లే వారితో కొద్దిసేపు మాట్లాడారు, త్వరలోనే అందరికీ శస్త్రచికిత్సలు పూర్తి చేసుకుని కంటిచూపు పొందుతారని వారికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,మీడియా ఇంచార్జ్ యాదగిరి గౌడ్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు సాగర్ యాదవ్,సెక్రటరీ రవి ప్రసాద్, టిఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, రామకోటి,నాయకులు కృష్ణ, నర్సింహారావు,తాత రమణ,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: