గుండాల జనవరి 23 (మన్యం మనుగడ)
శభాష్ పోలీస్. బాధిత కుటుంబానికి 36 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన గుండాల గ్రామానికి చెందిన గడ్డం సతీష్ ఎస్ ఐ ( ఏ ఆర్) మండలం పరిధిలోని నరసాపురం తండా కు బాలాజీ ఆర్థిక ఇబ్బందులతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా బాలాజీ కుటుంబానికి ఆదివారం ఎస్ ఐ గడ్డం సతీష చేయుత అందించారు. గతంలో సైతం ముత్తపురం గ్రామానికి చెందిన కల్తీ రాజేశ్వరికి సైతం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన బాధ్యతగా భావించాలని ఎస్ ఐ గడ్డం సతీష్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి సరైన సమయంలో రక్తం అందకపోవడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతుందని అందుచేతనే ఆన్ లైన్ బ్లడ్ సర్వీసును ప్రారంభించామన్నారు రక్తం కావలసినవారు ఈ నెంబర్ 8121819343కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న సతీష్ లు పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎస్ ఐ సురేష్ , సర్పంచ్ అజ్మీరా మోహన్, మోహన్ మోహన్, గుండాల ఎంపీటీసీ ఎస్కే సందని, టిఆర్ఎస్ నాయకులు శ్రీను పాల్గొన్నారు
Post A Comment: