CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉద్యోగుల ఊపిరి తీస్తున్న జీవో నెంబర్ 317 రద్దు చేయాలి.జోనల్,మల్టీ జోనల్ పోస్టుల విషయంలో ఉద్యోగ సంఘాలతో,చర్చించి అందరికీ ఆమోద యోగ్య మైన బదిలీలను చేపట్టాలి.

Share it:



  • స్థానికత ఆధారంగా రిక్రూట్మెంట్ చెయ్యాలి.
  • ఉద్యోగులకు స్థానికంగా నే ప్రాధాన్యత కల్పించాలి.
  • ఉద్యోగులు స్థానికతను కోల్పోయే అవకాశం ఉంది.
  • రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది.
  • 317 జీవో ను రద్దు చేయాలని కోరుతూ జాతీయ రహదారి పై బైటాయించి నిరసన వ్యక్తం చేసినకాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు కేంద్రములో కార్య కర్తలతో కలసి జీవో నెంబర్ 317 ను రద్దు చేయాలని కోరుతూ ములుగు జాతీయ రహదారి పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ధర్నా రాస్తో రోకో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉన్న చోట ఉండని వ్వకుండా,ఉద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని ఉద్యోగుల అలాట్మెంట్ ప్రక్రియలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని 317 జీవో రద్దు చేయాలని,దీని వల్ల అనేక మంది ఉద్యోగ ఉపాధ్యా యుల కుటుంబాలు చిన్నా భిన్నమై శాశ్వతంగా వాళ్ల స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర పోరాటానికి మూల సిద్ధాంతమైన స్థానికతను మరిచిపోయారు.సకల జనుల సమ్మె,మానవహారం,సహాయ నిరాకరణ లాంటి వీరోచిత పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పక్కకు పెట్టడం వారిని వారి స్థానిక ప్రాంతాలకు దూరంగా నెట్టి వేయడం దుర దృష్టకరమని వాపోయారు. కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల ని,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి ఉన్న నాలుగు డిఏలను వెంటనే మంజూరు చేయా లని,సి పి ఎస్ ను రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని అమ ల్లోకి తేవాలని ప్రభు త్వానికి 317 జీవో ప్రకారం నష్టపోయిన స్థానికతను కోల్పోయిన ఉద్యో గ ఉపాధ్యాయులకు తిరిగి వారి వారి స్థానిక జిల్లా లో,జోన్లలో,మల్టీ జోన్లలో అవకాశం కల్పించాలని కోరారు.గతంలో 610 జీవో ద్వారా కూడా స్థానికత ఆధారంగానే ఉద్యోగ ఉపా ధ్యాయులని వారి వారి సొంత జిల్లాలకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి.ఇది కేవలం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య కాదు భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉద్యోగ ఖాళీలు ఉండే అవకాశం లేదని కాబట్టి వెంటనే ప్రభుత్వం 317 జీవో ను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగ ఉపా ధ్యాయుల ప్రక్రియ జరపాలని ఉద్యోగుల ప్రాణాలను తీస్తున్న జీఓ నెంబర్ 317 రద్దు చేయా లని అన్నారు.జోనల్,మల్టీ జోనల్ పోస్టుల విషయం లో ఉద్యోగ సంఘాల తో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని అన్నా రు.స్పౌస్ బదిలీలు అన్ని జిల్లా లకు వర్తింప చేయాలని,సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జూనియర్లు ను ఏజెన్సీ ప్రాంతాల్లో బదిలీ చేయడం వలన ఇంకా 20 యేండ్ల వరకు కొత్త ఉద్యోగాలు భర్తీ అయే అవకాశం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యయులను చైతన్య పరిచి ఉద్యమిస్తార న్నారని అన్నారు.ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవళి రెడ్డి,జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ ఆయూబ్ ఖాన్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,సర్పంచులు తుమ్మేటి రాజీ రెడ్డి,మాడ ప్రకాష్,రత్నం భద్రయ్య, జిల్లా,మండల,గ్రామ,పట్టణ అధ్యక్షులు అనుబంధ సంఘాలఅధ్యక్షులు,ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లు,యువజన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: