విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం మనుగడ, మణుగూరు:రేగా విష్ణు
చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 24,27,31 తేదీలలో మణుగూరు మండలం లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.... ఇప్పటికే సుమారు వేలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి,అవసరమైన వారికి రేగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో500 పైగా ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లతో పాటు ఖర్చులు మొత్తం రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ భరించడం జరుగుతుందన్నారు.ఉచిత కంటి ఆపరేషన్లు నిరంతర ప్రక్రియ అని సంవత్సరం పాటు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
Post A Comment: