CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మిర్చి రైతులను ఆదుకోవాలి.పండించిన పంట కొనలే నప్పుడు రైతుబంధు సంబరాలు ఎందుకు?.వరి పంటకు,మిర్చి పంటకు మద్దతు ధర కలిగిస్తూ,వరి ధాన్యానికి 200 రూపాయలు బోనస్ ఇవ్వాలి.

Share it:



  • మిర్చి పంటకు 800 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్.
  • రైతు బంధు పథకం ద్వారా దొరల కే లాభం కానీ పేదవాడు పేదవాడి లాగానే ఉంటున్నా డు.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల రొయ్యూరు, శంకరపల్లి గ్రామాలలో మిర్చి తోటలను సందర్శించిన ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ. ఒక పక్క రైతన్న పుట్టెడు కష్టాల్లో మునిగిపోతే టిఆర్ఎస్ పార్టీ రైతుబంధు ఇస్తూ 50 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు ఇచ్చామని, టిఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని కానీ రైతన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు ఉందని వరి పంట వేయవద్దని ప్రభుత్వము చెప్పడంతో రైతన్న దిక్కులేని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితిలో ఉన్నాడని,మరో పక్క మిర్చి పంటకు కమల పురుగు,వైరస్,ముడత,సోకి మిర్చి రైతు కష్టాలలో కూరుకు పోయి అప్పుల్లో మునిగి పో యాడని,ఒక పక్కమిర్చి తోట ముడత వైరస్ తో చచ్చిపోయి ఎకరానికి 1లక్ష 50 వేల రూపాయల పెట్టుబడి అయితే, ఎట్లా అప్పులు తీర్చేలే,అని రైతు ఉంటే మరోపక్క అకాల వర్షాల వల్ల మిర్చి పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని,అదేవిధంగా వరి పండించిన రైతు మార్కెట్ కు తీసుకపోతే,ఒక క్వింటా ధాన్యానికి పది కేజీల చొప్పున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల యజమానులు,మిల్లర్లు కలసి దోపిడి చేస్తుంటే,రైతు సంబ రాలు చేసుకుంటు న్నారనిఅన్నారు.రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ అతివృష్టి కారణంగా,అనా వృష్టి కారణంగా,ప్రకృతి ప్రభావం వల్ల పంట నష్టపోయిన,వివిధ రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకున్నదని అన్నారు.

రైతుల పేరు చెప్పి తెలంగాణ ప్రభుత్వం వారి బంధువుల కోసం వారి చుట్టాల కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం మరి దొరలకు లాభం చేకూర్చే విధంగా ఉందని పేద వాడిని పేద వాడిగా చేస్తుందని కౌలు రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుందని అన్నారు.దొరలను భూస్వా ములుగా చేసే ఈ రైతు బంధు పథకం.భూస్వాములు రైతులకు భూములను కౌలుకు ఇస్తూ డబ్బులు డబ్బులూ తీసుకుంటూ,మరోపక్క రైతుబంధు డబ్బులు తీసుకుంటున్నారని,అన్నారు. అదేవిధంగా వచ్చిన డబ్బులతో భూస్వాములు సంవత్సరానికి ఒక ఏకరం చొప్పున కొంటున్నారని రైతు మాత్రం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక వడ్లు కొనుగోలు కేంద్రాల యజ మానులు,మిల్లర్లు,దోపిడీ చేస్తున్నారని,టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి ఎన్ని సంవత్సరాల నుండి తీసుకో కపోయినా ఏ రోజు కూడా ఒక మాట కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అనలేదని అన్నారు పది కేజీల వడ్ల లో అధికార పార్టీ నాయకులకు ప్రభు త్వానికి వాటా ఉందని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు మిల్లర్ల అవినీతిపై వడ్ల కటింగ్ పై ఏ రోజు కూడా నోరు విప్పలేదని,వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకో లేదని అన్నారు.వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాల యజ మానులపై మిల్లర్ లపై విజిలెన్స్ వారితో ఎంక్వయిరీ చేసి రైతుల వద్ద తీసుకున్న సొమ్మును ఇప్పించాలని డిమాండ్ చేశారు.ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అయూబ్ ఖాన్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,ఎస్సీ సెల్ జిల్లా నాయకులు కొండకొర్ల పోషాలు,మండల నాయకులు జిమిడ రవి,ఎండి రియాజ్ జియా,ఎండి గౌస్,ఎండి ఖలీల్ ఖాన్,సోదరి రామయ్య,ఎండి యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: