CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మేడారం జాతర పనులపై సమీక్ష సమావేశం.జనవరి 15 వరకు పూర్తి చేయండి.జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సమీక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతర సమీపిస్తున్న సందర్భంగా పలుచోట్ల పర్యటించి మేడారం జాతర అభివృద్ధి పనులు ఈ నెల15 వరకు పూర్తిచేయాలని అన్నారు.మంగళవారం ఐటిడిఎ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.మేడారం జాతర అభివృద్ధి పనులు పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ ఐటీడీఏ నిధులతో నూతన నిర్మాణం చేపట్టిన రెవెన్యూ అతిథిగృహంలో సందర్శించారు.చివరి దశలో ఉన్న భవనం జనవరి 15 వరకు పూర్తిచేయాలని ఇ ఇ హేమలత ను ఆదేశించారు. ఆర్ డబ్ల్యు ఎస్ ద్వారా నిర్మాణం చేస్తున్న వాటర్ ట్యాంక్ ను,అతిథి గృహం పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్ డ బ్ల్యూ ఎస్ ఇఇ మాణిక్యరావును ఆదేశించారు.క్యూలైన్ లను, పోలీసు బారికేడ్ స్థలం, దేవాదాయ శాఖ రూములు, వాచ్ టవర్,పనులు చేయాలని పూజరుల కోసం,విఐపిలకు అదనంగా మరో పది రూములు నిర్మించాలని ఐటిడిఏ ఇఇ ని ఆదేశించారు.దేవాదాయశాఖ డార్మెంటరీ ఆల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.వైద్య శాఖ మరియు మీడియా పాయింట్ ను పరిశీలించి ఏర్పాట్లు చేయాలని అన్నారు.పర్యటన అనంతరం జిల్లా కలెక్టర్ వివిధ జోనల్,సెక్టోరియల్ అధికారులతో సమీక్ష కార్యక్రమంలో మాట్లాడుతూ. జాతరలో ఏర్పాటు చేసిన ఆరు సీట్లకు అమ్మవార్ల పేర్లు పెట్టాలని ఒక షెడ్ కి సమ్మక్క, సారలమ్మ,పగిడిద్దరాజు, గోవిందరాజు,జంపన్న పేర్లను పెట్టి ప్రజలకు అర్థమయ్యేలా బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు.జాతర విధులు నిర్వర్తించే అధికారులకు, జోనల్,సెక్టోరియల్ అధికారులకు మేడారం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేయాలని అన్నారు.శానిటేషన్ వర్కర్లకు వసతి ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఇంజనీరింగ్ పనులు టెండర్స్ పూర్తి అయి పనులు ప్రారంభించకుండా ఏమైనా పనులు ఉన్నట్లయితే త్వరగా ప్రారంభించాలని అన్నారు. జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని అన్నారు.జాతర కు వచ్చే చే పూజారుల కుటుంబాలకు కూడా అన్ని వసతులు కల్పించాలని అన్నారు.పార్కింగ్ ఏరియా లో ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేలా చూడాలని పార్కింగ్లో లైటింగ్ ఎక్కువ ఉండేలా చూడాలని అన్నారు.దేవుళ్ళ గద్దెలపై నిత్యం కాంతులు విరజిమ్మే లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు.అండర్ గ్రౌండ్ ద్వారా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డ్రింకింగ్ వాటర్ కి ఎలాంటి కొరత లేకుండా చూడాలని ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడు హెలిప్యాడ్ మరమ్మతులు చేయాలని ఆదేశించారు.మేడారం జాతర ఏర్పాట్ల నిర్వహణకు తొమ్మిది జోన్లుగా విభజించి 38 పనులు నిర్వహించుటకు,ఒక్కొక్క జోన్గా కేటాయించి పనులు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.జోన్ల వారీగా మరుగుదొడ్ల నిర్మాణం,బ్యాటరీ టాప్,విద్యుత్,పోలీసులు శాఖ లు ఏర్పాటు లైటింగ్ త్రాగునీటి ఏర్పాటు పార్కింగ్ ఏరియాలో ఏర్పాట్లను చూడాలని అన్నారు.పైలెట్ ప్రాజెక్టుగా ఊరట్టం పార్కింగ్ స్థలంలో అన్ని హంగులతో పార్కింగ్ ఏర్పాట్లు ఈ నెల 11 వరకు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ ఏరియా లో భక్తులు అన్నీ తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి, డి ఆర్ వో రమాదేవి,ఐటీడీఏ పీవో వసంతరావు,ములుగు, ఏటూరు నాగారం ఏఎస్పి లు సుధీర్ రామనాథ్ కేకన్,అశోక్ కుమార్, కలెక్టరేట్ ఈవో శ్యామ్,సూపరిండెంట్ రాజు ప్రకాష్,ఐటిడిఎ ఇఇ హేమలత, డిఈ నవీన్ కుమార్,డి ఎం హెచ్ ఓ అప్పయ్య,ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ మాణిక్యరావు, మేడారం ప్రధాన పూజారి సిద్దబోయిన జగ్గారావు,ఈవో రాజేందర్,తాసిల్దార్ లు, ఎంపీడీవోలు,సంబంధిత శాఖ అధికారులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: