CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగరేణి లోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు ఫిబ్రవరి 12 నుంచి జరగబోయే నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలి: సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ పిలుపు..

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


సింగరేణి లో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ,ఫిబ్రవరి 12 నుంచి జరగబోయే నిరవధిక సమ్మెకు సింగరేణి లోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు సిద్ధంగా ఉండాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక, ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో శివ అధ్యక్షతన జేఏసీ మణుగూరు బ్రాంచ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి,జి.శ్రీనివాస్, తోట.రమేష్,నల్ల.రమేష్,వెలగపల్లి.జాన్,కనకయ్య పాల్గొని మాట్లాడుతూ,రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు, ఇతర ధరలు ఆకాశాన్ని అంటుతుండగా కార్మికుల వేతనాలు మాత్రం పాతాళంలో ఉన్నాయని అన్నారు.ఈ స్థితిలో వేతనాలు పెంచాలని సింగరేణి యాజమాన్యానికి అనేక సార్లు విన్నవించిన ప్పటికీ,అనేక ఆందోళనలు నిర్వహించినప్పటికీ సింగరేణి యాజమాన్యం చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా వ్యవహరిస్తుంది, తప్ప వేతనాలు మాత్రం పెంచడం లేదన్నారు.ఈ స్థితిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సమ్మె తప్ప మరోమార్గం లేదన్నారు.అందుకే ఫిబ్రవరి 12వ తారీకు నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేసి సింగరేణి యాజమాన్యం కళ్లు తెరిపించి,వేతనాలు పెంచుకోవాలన్నారు.సమ్మె సన్నాహకం లో భాగంగా జనవరి 31,ఫిబ్రవరి 1వ తారీకు ఓబీ కార్మికులు,కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు నిరసన బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని,ఫిబ్రవరి 5 నుండి 8 వ తారీఖు వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం ఆఫీసు ముందు ధర్నాలు నిర్వహించాలని,ఫిబ్రవరి 9 న చలో హెడ్ ఆఫీస్ కొత్తగూడెం కార్యక్రమం నిర్వహించాలని, రాష్ట్ర జేఏసీ పిలుపు నివ్వడం జరిగిందన్నారు.రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుతో మణుగూరు ఏరియా లోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ సమావేశం లో జేఏసీ నాయకులు ఎండీ. గౌస్,వి.జానయ్య,ఐ.రాములు, ఉప్పుతల.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: