CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి ఫిబ్రవరి 12 నుండి నిరవధిక సమ్మె.

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంపు, చట్టబద్ధ సౌకర్యాల అమలు, ఇతర సమస్యల పరిష్కారానికై సింగరేణి లోని అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు నిరసన బ్యాడ్జీలు ధరించి సింగరేణి యాజమాన్యానికి తమ నిరసనను తెలియజేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా మణుగూరు లోని సింగరేణి కన్వీనియన్స్ వాహన డ్రైవర్లు డిమాండ్ బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు.

            ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు మణుగూరు బ్రాంచ్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికుల తో సమానంగా పని చేస్తూ సింగరేణి లాభాల్లో భాగస్వామ్యం అవుతున్నప్పటికీ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అనేకసార్లు యాజమాన్యం దృష్టికి వేతనాల పెంపు విషయం తీసుక వెళ్లినప్పటికీ పట్టించుకోక పోవడం వలనే తప్పనిసరి పరిస్థితులలో ఫిబ్రవరి 12 నుండి నిరవధిక సమ్మె చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసి పిలుపునిచ్చింది అని అన్నారు. ఈ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేసి సహకరించాలని కోరారు.

       ఈ కార్యక్రమం లో విజయ్, శ్రీను, బాలు, కుమార్, సాయి, షబ్బీర్, సంతోష్, నాగరాజు, రాంబాబు, ఉమా శంకర్, ఖాన్, రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: