CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జనవరి 12 నుండి మద్దికొండ యూత్ అద్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్.11వ తేదీ వరకు ఎంట్రీ పీజులకు ఆహ్వానం.

Share it:


 

  •  విజేతలకు రూ.53 వేలు నగదు బహుమతులు
  •  క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం


 మన్యంటీవి, అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతను ప్రోత్సహించేందుకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగా సందర్బంగా రాజకీయాలకు అతీతంగా జనవరి 12వ తేదీ నుండి 14వ తేది వరుకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు మద్దికొండ యూత్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం మద్దికొండ గ్రామంలో నారం సత్యనారాయణ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, నారం వెంకటేష్ మెమోరియల్ అద్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే వారు ఈ నెల 11వ తేదీ లోపు ప్రవేశ రుసుము 300/- చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. అదేవిదంగా సెటిల్ ప్రవేశ రుసుము 200/- వుందని తెలియజేసారు. మహిళలకు ముగ్గులు పోటీలు, చిన్న పిల్లలకు ఆటలు పోటీలు జరపబడునని తెలియజేసారు.

ఈ యొక్క వాలీ బాల్ టోర్నమెంట్ లో మొదటి బహుమతిగా 20 వేల రూపాయలు, రెండవ బహుమతిగా 15 వేల రూపాయలు, మూడవ బహుమతిగా 10 వేల రూపాయలు, నాల్గొవ బహుమతిగా 5 వేల రూపాయలు, ఐదవ బహుమతిగా 3 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా అశ్వారావుపేట సిఐ బి ఉపేంద్రరావు, ఎస్ఐ సిహెచ్ అరుణ, ఎస్ఐ వి రామూర్తి, దమ్మపేట ఎస్ఐ కె శ్రావణ్ కుమార్ విచ్చేయు చున్నట్లు తెలియజేసారు. ఈ సందర్భంగా యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకే ఏటా అనేక మందితో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ పంచాయతీ క్రీడాకారులు ఆ పంచాయతీ తరుఫునే ఆడాల్సి ఉంటుందని, పాల్గొనే ప్రతి ఒక్కరూ చిరునామా, ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుందని, ఒక పంచాయతీకి సంబంధించి ఎన్ని జట్లు అయినా పాల్గొన వచ్చనని పేర్కొన్నారు. క్రీడలు నిర్వహణలో తలెత్తే సమస్యలలో తుదినిర్ణయం కమిటి వారిదే అని పేర్కొన్నారు. జనవరి 12వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నీ 3 రోజుల పాటు జరుగుతుందని, క్రీడాకారులకు మధ్యాహ్నం భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు, పేర్ల నమోదుకు 9676391698, 8464001780 నంబర్లను సంప్రదించవచ్చనని కోరారు.

Share it:

TS

Post A Comment: