మన్యం మనుగడ, మణుగూరు:పినపాక నియోజకవర్గంలోని 100 కుటుంబాలకు తొలి విడత లో దళిత బంధు అమలు చేయనున్నట్లు విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ మేరకు ఆయన మణుగూరు క్యాంప్ కార్యాలయంలోఆదివారం విలేకరులతో మాట్లాడారు.స్వాతంత్య్ర భారత వనిలో దగా పడ్డ దళిత జాతిని మేల్కొపి వారిలో ఆర్ధిక స్థిరత్వం సాధించడానికి దళిత బంధు అమలు చేయడం జరుగుతుంది, ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.లబ్ధిదారులను గుర్తించే బాధ్యత ఎమ్మెల్యే లదే అని,పారదర్శకంగా ఎంపికలు ఉంటాయన్నారు.మార్చి లోపు గ్రౌండింగ్ పూర్తి చేసి లబ్ది దారులకు వారు కోరిన యూనిట్లు మంజూరు చేసి గ్రౌండింగ్ పూర్తి చేసి వారికి అందజేయ్యడం జరుగుతుందన్నారు.
Post A Comment: