CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

100 నవ్వులు విందు, సాంస్కృతిక హంగామా బ్యానర్ను ఆవిష్కరించిన ఎంఎల్ఏ మెచ్చా.

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట లో షాదీఖానా గుడ్ న్యూస్ స్కూల్ వద్ద జనవరి 26 వ తారీఖు నాడు రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేయన్నున్న సాంస్కృతిక కార్యక్రమం 100 నవ్వుల విందు, సాంస్కృతిక హంగామా, అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క బ్యానర్ని ఆర్గనైజర్, ప్రజా గాయకులు ముర్తుజ సమక్షంలో అశ్వరావుపేట శాసనసభ్యులు ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆర్గనైజర్, ప్రజా గాయకులు ముర్తుజ మాట్లాడుతూ పేద కళాకారుల సహాయార్థం 100 మంది కళాకారులచే వంద నవ్వుల విందు సాంస్కృతిక హంగామా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగుతుందని తెలిపారు. కరోనా విపత్తు కష్టకాలంలో ఎందరో కళాకారులు ప్రాణాలు కోల్పోవడం జరిగి, చాలా మంది కళాకారులు కరోనా కారణంగా ఏ పని లేక కుటుంబాల పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని,

మనమందరము వారికి సహాయం చేయవలసిన అవసరం ఉన్నదని వారి సహాయ కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ 100 నవ్వుల విందు కార్యక్రమం, అని నిర్వాహకులు తెలిపారు, ఈ కార్యక్రమ నిమిత్తం అశ్వరావుపేట స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 100 నవ్వుల విందు, సాంస్కృతిక హంగామా బ్యానర్ ను,ఆవిష్కరించారని తెలిపినారు. ఈ కార్యక్రమంలో దాతలు ఇచ్చే విరాళాల ద్వారా 100 మంది కళాకారులతో, పాటల పోటీలు నిర్వహించటం జరుగుతుందని, ఆర్గనైజర్ మరియు ప్రజా గాయకులు మూర్తుజ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి ఖమ్మం జిల్లా కళ అభిమానులు ప్రజలు తమకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వవలసిందిగా తెలిపినారు, ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తాగుబోతు రమేష్, రాజమౌళి జబర్దస్త్ టీం, ప్రముఖ డ్యాన్సర్ ఈశ్వర్ బహుదూర్ చే ఫైర్ డాన్స్, మరియు కామెడీ స్కిట్స్, ప్రముఖ మెజీషియన్ కేవీ చౌదరి వారి మ్యూజిక్ ప్రోగ్రాం, వెంకటేశం వారి టాకింగ్ డాల్, మొగిలి గుణ కర్ వారి ఖుషీ ఖుషిగా, కార్యక్రమం, ప్రముఖ సింగర్ రైటర్ జనాబ్, సింగర్, మూస వారి పేరడి సాంగ్స్, నూక పొంగు వెంకయ్య వారి బృందంచే చైతన్య గీతాలు, కంపాటి శ్రీను జానపద గేయాలు, యాసీన్ డాన్స్ అకాడమీ వారిచే బృంద నృత్యాలు, సంతోష్ డాన్స్ అకాడమీ వారిచే, జానపద సాంప్రదాయ నృత్యాలు, జూనియర్ గద్దర్ శేషన్న వారి బృందం తో పల్లె సుద్దులు కార్యక్రమం, డప్పు మాస్టర్ మల్లేష్ వారిచే ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ మరియు ప్రజా గాయకులు మూర్తుజా తెలిపినారు, ఈ కార్యక్రమ నిమిత్తం హృదయపూర్వక విరాళాలు ఇవ్వాల్సిందిగా వారు కోరినారు, విరాళాలు ఇవ్వాల్సిన వారు గూగుల్ పే మరియు ఫోన్ పే నంబరు 9390269629 ద్వారా తోచిన విరాళాలు అందించవలసిందిగా కోరినారు.

Share it:

TS

Post A Comment: