CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అక్రమాలకు పాల్పడుతున్న ఎస్సీ గురుకులం ప్రిన్సిపాల్ శాంతికుమారి పై చర్యలు తీసుకోవాలి.: PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కాంపాటి పృద్వి

Share it:

 

మన్యం టీవి వెబ్ డెస్క్:

బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల పొట్ట గొడుతూఅక్రమార్జనే ధ్యేయంగా విద్యార్థులకు చాలీచాలని ఆహారాన్ని పెడుతూ అర్ధాకలితో ఉన్న విద్యార్థులు తమకు ఆహారం సరిపోవడం లేదని అడుగుతే వారిని బెదిరింపులకు గురి చేస్తున్న పాల్వంచ ఎస్సీ గురుకులం ప్రిన్సిపాల్ శాంతి కుమారి ని వెంటనే సస్పెండ్ చేసి విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ అనుదీప్ గారికి అందించిన ఫిర్యాదు లో పేర్కొన్న అంశాలపై న్యాయ విచారణ చేపట్టాలని PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృధ్వి డిమాండ్ చేశారు.

పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు,ఉద్యోగులు,వర్కర్ల పై అధికారం చెలాయిస్తూ కళాశాలకు వచ్చే ఆదాయ వనరులను దోపిడీ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కళాశాల మరియు పాఠశాలలో స్లీపర్ శానిటైజర్ టెండర్లను తన అనుచరుల కి ఇచ్చి కమీషన్ల దందాకు పాల్పడుతున్నారని ప్రైవేటు వ్యక్తులతో హాస్టల్ లో పనిచేస్తున్న వర్కర్ల పై బెదిరింపులు చేయిస్తూ తనకు ఎవరు ఎదురు లేరు అనే ధీమాతో తన ఇష్టానుసారంగా హాస్టల్ అడ్మినిస్ట్రేషన్ ను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు ఫిజిక్స్ ,గణితం లెక్చరర్స్ లేరని, కళాశాలకు మంచినీటి సౌకర్యం లేదని విద్యార్థులు తన దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాల్సిన ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కళాశాల విషయాలు బయటకు ఎవరైనా చెబితే మీకు టీసీ లు ఇచ్చి పంపిస్తానని విద్యార్థులను బెదిరించి విద్యార్థులను మానసిక వేధింపులకు గురి చేసిన ఎస్ సిగురుకులం ప్రిన్సిపాల్ శాంతి కుమారి పై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: