CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థి చదువు కోసం మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం.

Share it:

 



మన్యం టీవీ చర్ల:

మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మడకం సూరిబాబు అనే పేద విద్యార్థి చదువు కి సంబంధించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రవేశ పరీక్ష కోసం మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం శ్రీ సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అక్కినేని లోకేష్ చేతులమీదుగా మూడువేల రూపాయలు మడకం సూరిబాబు అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల మురళి మాట్లాడుతూ మదర్ తెరిస్సా జన్మదినం సందర్భంగా 2015 సంవత్సరం లో చర్ల మండలం పుసుగుప్ప గ్రామానికి చెందిన పేద విద్యార్థి అయిన మడకం సూరిబాబు ను మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ దత్తత తీసుకోవడం జరిగినదని తెలిపారు.

ఆ రోజు నుండి కూడా విద్యార్థి సూరిబాబు కు చదువుకు సంబంధించిన ఏ ఆర్థిక అవసరం ఉన్నా కూడా ఆ ఆర్థిక సహాయం ను ట్రస్ట్ ద్వారానే అందించడం జరుగుతుందని మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల. మురళి తెలిపారు. అలాగే సూరిబాబు ప్రభుత్వ ఉద్యోగులు సాధించేవరకు మదర్ తెరిసా ట్రస్ట్ ద్వారా చదువు కు సంబంధించిన ఆర్థిక సహాయం అందిస్తూనే ఉంటుందని తెలిపారు.

మూడువేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ లోకేష్ గారికి ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: