CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విప్ రేగా ఇంటింటికీ కేసీఆర్,గ్రామ గ్రామానికి టిఆర్ఎస్ కార్యక్రమం కు ప్రజలలో విశేష స్పందన.సాంబయి గూడెం సభకు భారీగా తరలి వచ్చిన మహిళలు,గ్రామస్తులు.

Share it:

 




మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని *ఇంటింటికి కేసీఆర్,గ్రామ గ్రామానికి టిఆర్ఎస్* కార్యక్రమంలో భాగంగా సాంబయి గూడెం లో ఏర్పాటు చేసిన సభకు విశేష స్పందన లభించింది.ఈ సభకు భారీ ఎత్తున మహిళలు,గ్రామ ప్రజలు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ రేగా ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు.ప్రజలకు మైక్ ఇచ్చి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి,సమస్య పరిష్కారానికై కృషి చేశారు. సాంబయి గూడెం ప్రాథమిక పాఠశాల కు ప్రహరీ గోడ నిర్మించాలని కోరగా,విప్ రేగా స్పందిస్తూ తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. త్రాగునీరు,కరెంటు సమస్యల పై సంబంధిత అధికారులతో మాట్లాడి,సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారుల ను ఆదేశించారు.అనంతరం విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కెసిఆర్ పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.దేశంలో ఎక్కడా లేని సంక్షేమాన్ని అమలు చేస్తూ,తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.పుట్టిన పసిపిల్లలకు కెసిఆర్ కిట్టు మొదలుకొని,వ్యక్తి మరణించిన తర్వాత దహణసంస్కారాలు చేయడానికి స్మశాన వాటిక ల నిర్మాణం వరకు,అనేక గొప్ప కార్యక్రమాలను టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆసరా పింఛన్లు,కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లాంటి పథకాలు ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు,రైతు బీమా,దళిత బంధు లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా అని,75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం లో ఎవరు చేయని ఆలోచన సీఎం కేసీఆర్ చేసారని తెలిపారు. కులాలకు,మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలు చేస్తూ,అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లె రూపురేఖలు మారాయని, పల్లెలన్నీ పరిశుభ్రంగా బాగు పడ్డాయి అని,ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం పల్లెల్లో కనిపిస్తుందని అన్నారు.మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచినీరు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు.24 గంటలు నాణ్యమైన కరెంటును అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,స్థానిక సర్పంచ్ కాయం.తిరుపతమ్మ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,నాయకులు కోలేటి భవాని శంకర్,టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీ లు,సర్పంచ్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్,సొసైటీ డైరెక్టర్లు,ఉప సర్పంచ్ లు, అధికారులు ఆర్ ఐ,ఎంపీఓ పి. వెంకటేశ్వర్లు,డి ఈ మహేందర్ రెడ్డి,ఏ పీ ఓ అహ్మతుల్లా, ఐటీడీఏ ఏఈ దీపాంజలి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుంధతి, ఎలక్ట్రికల్ ఏఈ వేణుగోపాల్,ఏ ఈ ఓ హారిక,స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: