CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సోమరి పోతుల వ్యవహరిస్తున్న పాల్వంచ తహసీల్దార్ పై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి.ఆదివాసీలకు శాపంగా మారిన ప్రభుత్వ అధికారుల పని తీరు .

Share it:

 


 

  • ఎన్ని ఫిర్యాదులు,దరఖాస్తులు చేసిన దున్నపోతు మీద వాన కురిసినట్టుగా వ్యవరిస్తున్న అధికారులు
  •  అన్ని శాఖల అధికారులకు దమ్ము,ధైర్యం,చీము,నెత్తురు,ఉంటే ఏజెన్సీ చట్టాలు అమలు చేసి చూపండి
  • ఆదివాసి సేన భద్రాద్రి జిల్లా కన్వీనర్ ఉకే రవి ములకలపల్లి:డిశంబర్31:మన్యం మనుగడ (న్యూస్)

 ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో 1996 నుంచి అమలులో ఉన్న పేసా చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వం యొక్క సామర్థ్యంపైన, విధుల పట్ల అంకిత భావం లేకుండా ముఖ్యంగా ఆదివాసీల విశ్వాసం సన్నగిల్లెలా ప్రవర్తించి అమాయక ఆదివాసులను పదిమంది ముందు భధనాం చేస్తూ,అమర్యాదగా విధులు నిర్వహిస్తూ సోమరి పోతుల వ్యవహరిస్తున్న పాల్వంచ ఎమ్మార్వో స్వామిపై ఐ పిసి,సి పి సి, సి ఆర్ పి సి ,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆదివాసీ సేన భద్రాద్రి జిల్లా కన్వీనర్ ఊకె రవి డిమాండ్ చేశారు,ఈ విషయంపై సేన భద్రాద్రి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది.ఇటీవల కాలంలో పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీ పరిధిలో ఆదివాసీలు వారి యొక్క ఆచారవ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం గ్రామ సభ నిర్వహించుటకు సమాచారం నిమిత్తం ఎమ్మార్వో స్వామిదగ్గర ఆఫీస్ కు వెళ్లగా పేసా చట్టమా అది ఏంటో నాకు తెలవదని,రిసీవ్డ్ ఏమీ లేదని, వెళ్లి కలెక్టర్ గారికి చెప్పండని, హేళన చేస్తూ పదిమంది ముందు బధనాం,,చేయడం పద్ధతి కాదని 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీల రక్షణ కొరకు ఉన్నటువంటి ఎల్ టి ఆర్, పేస,1/70,ROFR,ఎస్ సి ,ఎస్టీ, అట్రాసిటీ, టి ఎస్ పి ఆర్-2018, చట్టాలు అమలు జరగవని,వాటిని కూడా అమలు చేయుటలో ఇదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటారని వారు ఆరోపించారు.అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని శాఖల అధికారులు పని తీరు ఏజెన్సీ చట్టాల అమలు పట్ల షెడ్యూల్డ్ ఏరియా ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు కూడా చట్టాలు అమలు చేయటం లేదని ఎన్ని దరఖాస్తులు,ఫిర్యాదులు, అధికారులకు చేసినా దున్నపోతు మీద వాన కురిసినట్లు గా వ్యవహరిస్తున్నారని ఇప్పటి వరకు ఎంత మంది గిరిజనేతరులను ఏజెన్సీ ఈ ప్రాంతం నుంచి పంపి వేశారో ఎన్ని బిల్డింగులు కూల్చారో ఎన్ని తప్పుడు పట్టాలు రద్దు చేశారో ఎంత భూమిని గిరిజనేతరుల నుంచి స్వాధీనం చేసుకున్నారో ఎంత మంది గిరిజనేతరుల మీద కేసులు నమోదు చేశారో ఎన్ని చట్టాలను అమలు చేశారు దశాబ్ధాల కాలం నుంచి లెక్కలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.ఏజెన్సీ అధికారుల పనితీరు ఆదివాసీలకు శాపంగా మారిందని, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులకు దమ్ము ,ధైర్యం చీము, నెత్తురు ఉంటే చిత్తశుద్ధితో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు,, చట్టాల అమలు పట్ల ఆదివాసీలకు రక్షణగా ఉండవలసిన ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని,అమలు చేయడం చేతకాకపోతే రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చోవాలని, లేకపోతే ఆత్మవిమర్శ చేసుకొని చట్టాలను అమలు చేయాలని,అదే విధంగా గతంలో అనేక సార్లు ఉన్నత స్థాయి అధికారులు పెస చట్టం అమలు గురించి క్రింది స్థాయి అధికారులకు పలు సూచనలు చేసినప్పటికీ అవి చదవకుండాహేళన చేయడం విడ్డూరంగా ఉందని వారు అన్నారు.ఈ విధం గా వ్యవహరించిన ఎమ్మార్వో పైన ఉన్నత స్థాయి కమిషన్ లకు ఫిర్యాదు చేస్తామని, ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఎమ్మార్వో స్వామిని విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆదివాసీ సేన ఆధ్వర్యంలో అన్ని ఆదివాసీ, ప్రజా సంఘాలను కలుపుకొని అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేసేంత వరకు కూడా పాల్వంచ హైవే ని దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు.ఇలాంటి అధికారుల వలన నిజాయితీగా పనిచేసే అధికారులకు చెడ్డపేరు వస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా నాయకులు నరేష్ కో కన్వీనర్ రమేష్ నాయకులు మహేష్ వెంకట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: