CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జీవనోపాధి కోసం పనికి వలస వెళ్లిన వ్యక్తి అదృశ్యం.

Share it:

 


ములకలపల్లి:(మన్యం మనుగడ)

న్యూస్:

కూలి పనుల నిమిత్తం వలస వెళ్లిన వ్యక్తి అదృశ్యం అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని సీతారాంపురం ఎస్సి కాలనీ కి చెందిన కుంపటి ముత్తయ్య ఒక మధ్యవర్తి ద్వారా కూలి పనుల నిమిత్తం 2006లో వలస వెళ్ళాడు.వెళ్లిన తరువాత నుండి కొంతకాలం పాటు కుటుంబ సభ్యులతో తీసుకు వెళ్లిన వ్యక్తి ఫోన్ ద్వారా మాట్లాడి క్షేమ సమాచారాన్ని అందించేవారు.గత రెండు సంవత్సరాలు గా తన తండ్రి ఎలా ఉన్నది,ఎక్కడ ఉన్నది చెప్పాలని మధ్యవర్తి చిన్నబాబు ను ఎంతగా అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించు తిరుగుతున్నాడని,కుంపటి ముత్తయ్య కుమార్తె కుమారి ఆవేదన వ్యక్తంచేశారు.తన తండ్రి ఆచూకీ కోసం మూడేళ్ళుగా ఎదురుచూసిన ఫలితం లేదని కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ విషయం స్థానిక పోలీస్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిపారు.అదృశ్యం ఆయిన వ్యక్తికి భార్య అనసూర్య,అల్లుడు వెంకటేశ్వర్లు ఉన్నారు.

Share it:

TS

Post A Comment: