CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాల కు సిద్ధం కావాలి.

Share it:

 


     మన్యం టీవీ కరకగూడెం: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ 52 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సోషలిజం జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కార్యదర్శి రామాటేంకి శ్రీను మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 51 వసంతాలు పూర్తి చేసుకుని 52వ వసంతంలోకి అడుగు పెడుతోంది, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడే ఏకైక సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు, ఎస్ఎఫ్ఐ కేరళ లోని త్రివేండ్రం నగరంలో 1970వ అధ్యాయనం పోరాటం నినాదంతో ఆవిర్భవించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యారంగ సమస్యలపై పోరాడిన విద్యార్థి నేతలు ఎంతోమంది అమరులయ్యారు వారి స్ఫూర్తితో విద్యార్థులు విద్యార్థి నాయకులు అనేక ఉద్యమాలతో విద్యార్థి సంఘం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఎస్ఎఫ్ఐ ఉంది, దేశంలో అమ్మాయిలపై అనేక దాడులు జరుగుతున్నాయి వాటిని అరికట్టడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి నిమిషానికో హత్యలు జరుగుతున్నాయి, దేశంలో అమ్మాయిలకు రక్షణ, భద్రత కల్పించాలి విద్యలో సమానత్వం ఉండాలి నిర్భయ చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ని వెనక్కి తీసుకోవాలి దీనితో కాషాయకరణ, మతోన్మాదం, ప్రైవేటీకరణ పెంపొందించడానికి ఈ పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని దీని ద్వారా అనేక మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యారని ఆయన అన్నారు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఫీజ్ రియాంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జెస్ పెంచాలని అయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్ధి అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోని దేశంలో రాష్ట్రంలో లో విద్యా రంగానికి పెద్దపీట వేయడం కోసం చదువుకున్న ఉపాధి అవకాశాలు ఇవ్వాలని సమరశీల పోరాటాలు విద్యార్థి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రామాటేంకి వంశీ ప్రణయ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: