CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మేమున్నాం.ఉప్పాక, బోటిగూడెం గ్రామ పంచాయితీలలో పర్యటన ఇంటింటికి కేసీఆర్‌ గ్రామ గ్రామానికి టీఆర్ఎస్‌ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్‌ పార్టీ నాయకులు .

Share it:

 




మన్యం మనుగడ, పినపాక : 


గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మీకు తోడుగా మేమున్నామని పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి లు తెలిపారు.

 తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రూపొందించిన కార్యక్రమంలో భాగంగా,

శుక్రవారం మండల పరిధిలోని ఉప్పాక, బోటిగూడెం గ్రామ పంచాయితీలలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అన్ని వీధులు తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు వెంటనే పరిష్కారిస్తామని, ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ ఫింఛన్లు, రైతుబంధు, రైతుభీమా, కేసీఆర్‌కిట్టు, గురుకులాలు తదితర పధకాలు అర్హులకు అందుతన్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన సమస్యలు కూడా వెంటనే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. 


ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రవివర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, పినపాక ఎంపీటీసీ చింతపాటి సత్యం, టీఆర్ఎస్‌ పార్టీ మండల నాయకులు కొండేరు నాగభూషణం,వారా నర్సింహారావు,వాసం స్వాతి, యాంపాటి సందీప్‌ రెడ్డి, సర్పంచ్‌లు సుధాకర్‌,పూనెం సుజాత,కొర్సా కృష్ణంరాజు,శివశంకర్, నాయకులు శ్యామల సతీష్, వారా వెంకటేష్‌,గద్దల సాంబయ్య, సారయ్య, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.


Share it:

TS

Post A Comment: