CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములకలపల్లి పోలీస్ వారి హెచ్చరిక

Share it:

 


మన్యం మనుగడ:డిసంబర్31: నూతన సంవత్సరం సందర్భంగా జరిగే వేడుకలను విషాదంగా మారకుండా తమ ఇంటి వద్దనే ప్రశాంతమైన వాతవారణంలో జరుపుకోవాలి.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశం,రాష్ట్రం కరోనా మహామ్మరి వైరస్ తో పోరాడుతుంది.

-కావున ప్రజలందరూ కూడా రోడ్ల పైకి వచ్చి సంబరాలు జరుపుకొవొద్ధు.బయట ఎవరూ కూడా గుంపులు గుంపులుగా తిరగవద్దు.గత సంవత్సరం కంటే ఈ ఏడాది చాల వరకు ప్రమాదాలు తగ్గాయి. నిబంధనలు అతిక్రమించి డీజేలు వినియోగిస్తే సీజు చేస్తాం.మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడ్డ వారి పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తాం.నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి సంవత్సరం మద్యం మత్తులో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు సైతం హాని కల్పించే విధంగా ర్యాష్ డ్రైవీంగ్ చేస్తున్నారు.మద్యం సేవించి రొడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా మరల రోడ్డు ప్రమాదాలలో ఎవరూ ప్రాణాలను కొల్పోకుండా చూడడం, ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం.ఈ న్యూయర్ వేడుకలు మొత్తం పూర్తిగా పోలీస్ పెట్రోలీంగ్, మండలం లోని అన్ని ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తాం..ఈ వేడుకలను సజావుగా జరుపుకునే వారికి పోలీస్ సహకారం ఉంటుంది.ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం.. 

పోలీసు వారి సూచనలు పాటించండి

                  బి. సురేష్

      సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్

      ములకలపల్లి పోలీస్ స్టేషన్

Share it:

TS

Post A Comment: