CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లె పల్లె కేసీఆర్ ప్రతి ఇంటికి టిఆర్ఎస్ కార్యక్రమంలో విస్తృతంగా పర్యటించిన ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 



ప్రతి పల్లెకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తా.మండల ప్రజలకు అండగా నిలుస్తా ప్రభుత్వ ఫలాలను చేరవేస్తా.

 

  

 గుండాల డిసెంబర్ 21 (మన్యం మనుగడ) మండలంలోని ప్రతి పల్లెకు ప్రభుత్వ పథకాలను చేర వేస్తానని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం పల్లె పల్లెకు కేసీఆర్ ప్రతి ఇంటికి టిఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా మండలం పరిధిలోని చెట్టుపల్లి పంచాయతీ లో గల రేగుల గూడెం, చెట్టుపల్లి, శంభుని గూడెం గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం పై రేగా దృష్టిసారించారు. గ్రామాల్లో విద్య, రోడ్లు, మంచినీళ్ల పై ప్రధాన దృష్టి పెట్టిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రేగుల గూడెం గ్రామంలో విద్యుత్ సమస్యతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తన నిధుల నుండి విద్యుత్ లైన్లు వేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చెట్టు పల్లి శంభుని గూడెం గ్రామాల్లో పర్యటించి 15 లక్షల రూపాయలతో మూడు సిసి రోడ్లను మంజూరు చేశారు. చెట్టుపల్లి, శంభుని గూడెం గ్రామాల్లో గల ప్రభుత్వ పాఠశాలలకు ఎమ్మెల్యే నిధుల నుండి ప్రహరీ గోడలకు సైతం మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, కార్యదర్శి రవీందర్రెడ్డి, నాయకులు మోకాళ్ళ వీరస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, యువజన విభాగం నాయకులు అజ్జు, చెట్టు పల్లి సర్పంచ్ ప్రమీల, సర్పంచ్ సుధాకర్, నాయకులు వట్టం రవి, కొరస లాలయ్య అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: