CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రములో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Share it:

 పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి


కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న మోడీ ప్రభుత్వం.

పేద ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీకి మద్దతుగా ములుగు కాంగ్రెస్ పార్టీ నిరసన యాత్ర.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీతక్క.


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కేంద్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ర్యాలీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క,ఈ సందర్భంగా మాట్లాడుతూ 

ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మకై పేద ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని,దేశంలో పెట్రోల్‌,డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ ధరలు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతుందని సీతక్క కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలతో రైతులు, కార్మికులు,చిన్న వ్యాపారులు, వేతన జీవులు, చిన్న-మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి దిగజారిపోతోందని, మోదీకి చెందిన నలుగు రైదుగురు మిత్రులకు మాత్రమే లాభం చేకూరుతోందని దుయ్యబట్టారు.కేంద్ర ప్రభుత్వం జీడీపీకి కొత్త భావనను ముందుకు తీసుకొస్తోం దన్నారు.జీడీపీ పెరుగుదల అంటే ఈ ప్రభుత్వం గ్యాస్‌,డీజిల్‌,పెట్రోల్‌ ధరలు పెంచడమని అనుకుం టోందంటూ ఎద్దేవా చేశారు. వీటి ధరలను పెంచడం ద్వారా గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.23లక్షల కోట్లు అర్జిం చిందన్నారు.ఈ డబ్బంతా ఎక్కడికి పోతోందో దేశ ప్రజలు ప్రశ్నించాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.అక్కడ ధరలు తగ్గుతుంటే భారత్‌లో ఎందుకు పెరుగుతున్నాయని అన్నారు.

2014లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎల్‌పీజీ వంట గ్యాస్‌ ధర రూ.410లు ఉంటే.. ఇప్పుడు అది రూ.885కి పెరిగిపోయిందన్నారు.అలాగే, అప్పట్లో రూ.71.5లుగా ఉన్న లీటరు పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.101లకు చేరిందన్నారు. రూ.57లుగా ఉన్న డీజిల్‌ ధర కూడా ప్రస్తుతం రూ.88కి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు.2014 నుంచి అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు తగ్గుతున్నా భారత్‌లో మాత్రం పెరిగిపోతున్నాయన్నారు. మరోవైపు,కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఆస్తులు,సంస్థలను అమ్మేస్తోందన్నారు.పెట్రోల్‌ ధరల పెంపుతో మనందరిపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,బ్లాక్ కాంగ్రెస్అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, ఎండీ ఆప్సర్ పాషా,జాలాపు అనంత రెడ్డి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, రసుపుత్ సీతారాం నాయక్,మచ్చ శాఖ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,

కన్నాయిగూడెం మండల జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ,సహకార సంఘం చైర్మన్ లు పన్నల ఎల్లారెడ్డి,బొక్క సత్తి రెడ్డి,మాజీ జెడ్పీటీసీ బోల్లు దేవేందర్,సర్పంచులు ఎంపీటీసీ లు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ జిల్లా నియోజక వర్గ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: