CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశాలు నిర్వహించాలి.

Share it:


 ములకపల్లి:మన్యం టీవి:ప్రతి అంగవ్వాడి కార్యకర్త విధిగా ప్రతి నెల గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశాలు నిర్వహించాలని,ధమ్మ పేట సిడిపిఓ రేవతి తెలిపారు. ములకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ధమ్మపేట ప్రాజెక్ట్ మీటింగ్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ లో అంగవ్వాడి కార్యకర్తలు ప్రధాన పాత్ర పోసిస్తున్నారని,అలాగే గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశాలను ప్రతి నెల విధిగా నిర్వహించాలని,బాలల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం చైల్డ్ హెల్ఫ్ లైన్ 1098,పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.0 నుంచి 18 సంవత్సరాల లోపు బాల,బాలికల కోసం పనిచేసే ఈ ఉచిత సహాయ కేంద్రమని బాల్య వివాహాలు జరుగుతున్న,బాలల పై వేధింపులు,అక్రమ రవాణా కు గురవుతున్న,ఆర్దిక, లైంగిక,శారీరక దోపిడీకి గురవుతున్న బాలలను చూసిన చైల్డ్ లైన్ 1098 ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమంచారం అందించాలని,సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచ బడతాయని,అవగాహనా కల్పించడం జరిగింది.సఖి వన్ స్టాప్ 181 టోల్ ఫ్రీ నెంబర్ పై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమణి,సాంమ్రాజ్యం,చైల్ద్ లైన్ 1098 టీం సభ్యులు బషీర్, సుమలత,బాలరాజు,సఖి 181 సిబ్బంది,అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: