CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన్యంలో పర్యటించిన విప్ రేగా. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

 

 


 గుండాల డిసెంబర్ 21 (మన్యం మనుగడ) మన్యం లో పర్యటించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. మంగళవారం ఆళ్లపల్లి మండలం పరిధిలోని మర్కోడు, బోడాయి కుంట పంచాయతీలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బొడాయి కుంట గ్రామానికి సిసి రోడ్డు కోసం 5 లక్షల రూపాయలు మర్కోడు గ్రామంలో రెండు సిసి రోడ్ల కోసం 10 లక్షల రూపాయలను మంజూరు చేశారు. అనంతరం నూతనంగా వివాహం చేసుకున్న లబ్ధిదారులు తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని వాటిని మండలంలోని ప్రతి పల్లెకు అందే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి హనుమంతరావు, ఎంపీపీ మంజుభార్గవి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, సర్పంచులు శంకర్ బాబు, వెంకటనారాయణ, నరసింహారావు, ప్రేమ కళ, ఆత్మ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, నాయకులు సమ్మయ్య, ఖయ్యుం, వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా నాయకులు కంచర్ల రవి, కిసారి రమేష్, ఉప సర్పంచ్ కమల అధికారులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: