CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భవాని చదువు కోసం అన్ని విధాల సహకరిస్తాం ..

Share it:

 


మన్యం టీవి,గుండాల :

ఇటీవల రిలీజ్ అయిన నీట్ పరీక్షలు మంచి మార్కులు సాధించి డాక్టర్ చదువు కోసం ప్రయత్నిస్తున్న కల్తీ భవానికి అన్ని విధాలుగా సహకరిస్తామని బిజెపి నాయకులు సోలం సతీష్, ప్రకాష్ అన్నారు. శుక్రవారం చీమలగూడెంలో ఆ కుటుంబాన్ని కలిసి చెప్పడం జరిగిందన్నారు. రెండు రోజుల్లో కొత్తగూడెం బిజెపి జిల్లా నాయకులకు భవానితో పాటు ఆ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి భవాని ఆర్థిక పరిస్థితిని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి అన్ని విధాల ఆమె చదువుకు ఆర్థికంగా ఉపయోగపడేలా చేస్తామని వెల్లడించారు. భవాని మారుమూల మండలం గుండాల మండలం లో నిరుపేద కుటుంబంలో పుట్టి చక్కటి మార్కులు సాధించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవాని లాగా మన మండలంలో మరింతమంది కష్టపడి చదివి చక్కటి మార్కులు తీసుకువచ్చి మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కృష్ణ, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: