CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎన్జీవో "సేవా భారతి" సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు చీరలు పంపిణీ..

Share it:

 మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 31, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని బచ్చల కోయగూడెం గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవో సంస్థ "సేవా భారతి" ఆధ్వర్యంలో గ్రామంలోని 66 నిరుపేద కుటుంబాలకి శుక్రవారం దుప్పట్లు, చీరలు, కండువాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ రావు, ఎస్సై కార్తీక్, స్కూల్ హెడ్మాస్టర్ యదల్లపల్లి వీరస్వామి, ఖమ్మం విభాగ్ సేవా ప్రముఖ్ మునీశ్వర్, జిల్లా కుటుంబ ప్రముఖ్ ఆత్మరామ్, భద్రాచలం జిల్లా సేవా ప్రముఖ్ సోడె శ్రీరామ్, స్పాన్సర్స్ కె ఎస్ రావు, శ్రీదేవి దంపతుల కుమారుడు ఎన్ఆర్ఐ కేశవ్, సలియోన, స్థానిక సేవా భారతి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం విభాగ్ సేవా ప్రముఖ్ మునీశ్వర్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా సేవాభారతి ద్వారా భద్రాచలం జిల్లా నక్సలైట్ ప్రభావిత గ్రామాల లో 1990 సం" నుండి బూర్గంపాడు భారతి భవన్ ఆవాస కేంద్రంగా విద్యార్థిని, విద్యార్థులకు 2000 మందిని ఉన్నత విద్యావంతులుగా డాక్టర్, ఇంజనీరింగ్, పోలీస్, ఫారెస్ట్, ఉపాధ్యాయ, నర్సింగ్ వృత్తిలో స్థిరపడే విధంగా ప్రోత్సాహం ఇచ్చింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలుపుతూ, డోనర్ కేశవ్ సలియోన దంపతులు రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి దేవుని ఆశీస్సులు ఆ దంపతులకు ఉండాలని అన్నారు. అదే విధంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిపారు. హెడ్మాస్టర్ యద్దలపల్లి వీరస్వామి మాట్లాడుతూ.. నిరుపేదలైన కుటుంబాలకు సేవాభారతి ద్వారా దుప్పట్లు, చీరలు ఇవ్వడం, కొవిడ్ సమయంలో సేవలను గుర్తు చేస్తూ ఎంతో ఆనందం వేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: