CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎక్షలెంట్ భాషా హైస్కూల్ లో ఘనంగా ఆజాదిక అమృత మహోత్సవ్ వారోత్సవాలు.

Share it:

 మన్యం మనుగడ , పినపాక.


భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆజాద్ కా అమృత్ మహోత్సవం. ఇది భారత స్వాతంత్ర దినోత్సవం 2022 ఆగస్టు 15 వరకు 75 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బయ్యారం క్రాస్ రోడ్ లోని ఎక్స్లెంట్ భాషా హైస్కూల్ నందు నిర్వహించిన ఆజాద్ అమృత మహోత్సవం సందర్బంగా చిత్రలేఖనం వకృత్వ ( ఉపన్యాస), వ్యాసరచన మొదలగు పలు అంశాలలో విద్యార్థిని విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎక్స్లెంట్ భాష హై స్కూల్ కరస్పాండెంట్ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మన దేశ దాస్య శృంఖలాల నుండి విడిపించుటకొరకు తమ ప్రాణాలు సైతం అర్పించిన మహానుభావులు గురించి వారి యొక్క త్యాగ నిరతికి, దేశం యొక్క ఔన్నత్యాన్ని దేశం లోని ప్రతి పౌరుడు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ దేశం కోసం పాటు పడాలి. విద్యార్థులు గా మీ యొక్క భాద్యత మీరు ఉన్నత చదువులు అభ్యసించి మన దేశ ఖ్యాతిని నలు దిశాల ఇనుమడింప చేయాలి .నేటి బాలలే భావి భారత నిర్మాతలు అన్న మన నేతాజీ మాటలు అక్షరాలా నిజం చేయాలంటూ, విద్యార్థులు చదువు తో పాటు సామాజిక సృహ కూడా కలిగి ఉండాలి అని విద్యార్థులకు తెలియజేశారు. తదనంతరం ఈ పోటీల్లో పాల్గొన్న వారందరిని అభినందించి గెలుపొందిన అందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్లెంట్ భాష హై స్కూల్ కరస్పాండెంట్ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్స్ ఖాదర్, యాకూబ్ షరీఫ్, ముక్కునర్సారెడ్డి,బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ సురేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: