CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమస్యల పరిష్కారమే ధ్యేయం--భూపాలపట్నం గ్రామ పంచాయితీలలో పర్యటన.ఇంటింటికి కేసీఆర్‌ గ్రామ గ్రామానికి టీఆర్ఎస్‌ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్‌ పార్టీ నాయకులు .

Share it:

 






మన్యం టీవి,పినపాక : 


గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తామని ఎంపీపీ గుమ్మడి గాంధీ,టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డిలు తెలిపారు.

 తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు రూపొందించిన కార్యక్రమంలో భాగంగా....బుధవారం 

భూపాలపట్నం గ్రామ పంచాయితీలలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పర్యటించారు. 


ఈ సందర్భంగా గ్రామంలో అన్ని వీధులు తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు వెంటనే పరిష్కారిస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఫింఛన్లు, రైతుబంధు, రైతుభీమా, కేసీఆర్‌కిట్టు, గురుకులాలు తదితర పధకాలు అర్హులకు అందుతన్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన సమస్యలు కూడా వెంటనే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు, కొండేరు నాగభూషణం, సర్పంచ్‌ కొర్సా కృష్ణంరాజు, మొగిలిపల్లి నర్సింహారావు, ఎంపీటీసీ సోలం కృష్ణకుమారి, కాయం శేఖర్, ఉప సర్పంచ్ నిట్ట వెంకటేశ్వర్లు , గ్రామ కమిటీ అధ్యక్షుడు నక్కా ప్రశాంత్‌, నాయకులు కృష్ణ, అశోక్‌, వెంకట్రావ్‌, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: