CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నిరసన-నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దగ్ధం.

Share it:



 మన్యంటీవి, అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పిలుపు లో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట లో టిఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నామని చెప్తూ తెలంగాణ రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బిజెపి నాయకులు ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని, కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్ర రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పలేని అసమర్ధ రాష్ట్ర బిజెపి నాయకులు రోజుకో మాట



మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు గుప్పించారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేని కేంద్రప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని దెబ్బతీసి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకు ప్రయత్నిస్తుందని అది కలగానే మిగిలి ఉంటుందని, రాబోయే రోజుల్లో రైతులు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి దోషిగా నిలబెడతారని అన్నారు. అనంతరం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కాకుండా కొనుగోలు చేయకుండా రాజకీయం చేస్తున్న నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బండి పుల్లారావు, జుజ్జురు వెంకన్న , ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ జూపల్లి రమేష్, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, జెడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, రాజమోహన్ రెడ్డి, గంధం వెంకటేశ్వరరావు, నార్లపాటి రాములు, బండారు శ్రీనివాసరావు, ఊట్లపల్లి సర్పంచ్ సాదు జోష్నా బాయ్, అశ్వారావుపేట పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సత్యవరపు సంపూర్ణ, పసుపులేటి పణీంద్ర, యు ఎస్ ప్రకాష్ రావు, అట్టం రమ్య, చిప్పనపల్లి బజారయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: