CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆగా ఖాన్ అకాడమీ లో అడ్మిషన్ సాధించిన ఇద్దరు విద్యార్థినిలను సన్మానించిన మంత్రి సత్యవతి రాథోడ్.

Share it:

 


మన్యం వెబ్ డెస్క్:

అవకాశం కల్పిస్తే గిరిజన బిడ్డలు అద్భుతాలు సృష్టిస్తారని నమ్మిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజన విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించడంతో అక్కడి విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో సీటు సాధిస్తూ మిగిలిన వారికి స్ఫూర్తిని ఇస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్, బయ్యారంలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆర్.దీక్షిత(సీరొల్), బానోత్ నిహారిక(బయ్యారం) ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఆగా ఖాన్ అకాడమీ లో అడ్మిషన్ సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. ప్రతిభ కలిగిన పేదింటి బిడ్డలకు ఈ ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందిస్తుందని హామీ ఇచ్చారు. బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులు, గ్రామం, రాష్ట్రానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.

Share it:

TS

Post A Comment: