CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఢిల్లీ రైతాంగ ఉద్యమ స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం పై తిరుగుబాటు చెయ్యాలి.

Share it:


  •  రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పిలుపు.
  • కార్పోరేట్ శక్తులకు తొత్తులుగా మారిన మోడీ,మాజీ ఎమ్మెల్యే కునేంనేని సాంబశివరావు ఆరోపణ.

 ములకలపల్లి:మన్యం టివి:

జిల్లా అఖిల భారత రైతు సంఘం 2వ మహాసభ జరిగింది.ఈ సభలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యి పద్మ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు తొత్తులుగా మారిపోయి దేశ రైతాంగం ను నడ్డి విరుచుటకు గాను,గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఎరువులు,పురుగు మందులు ధరలు పెంచుతూ సామాన్య రైతులకు నష్టం చేస్తున్నారని,వరి సాగు చేస్తున్న రైతులను కేంద్రం లో ప్రధాని మోడీ,ఈ రాష్ట్రం లో కేసీఆర్ మానసికంగా వేధిస్తున్నారని,వడ్లు కొనుగోలు చెయ్యకుండా ఇబ్బందులు పెడుతున్నారని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు.మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతులను ఏడాది పాటు ఢిల్లీ లో ఉద్యమాన్ని ఇబ్బందులు గురిచేశారని,దేశంలో నల్ల చట్టాలు రద్దు కోసం జరిగిన పోరాటంలో మరణించిన రైతులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కునేంనేని సాంబశివరావు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.మద్దతు ధర చట్టం,మార్కెటింగ్ సౌకర్యం కల్పన కోసం చట్టాలు తీసుక రావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా,ముత్యాల విశ్వనాదం,ఏపూర్ బ్రహ్మం,నరాటి రమేష్,సరిడ్డి పుల్లారెడ్డి, శ్రీనివాస్,చంద్ర నరేంద్ర,రవి,ఉకే నారాయణ,సలీమ్,కల్లూరు వెంకటేశ్వరరావు,స్వరాజ్యరావు,బిక్ష,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: