CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తూతూమంత్రంగా జూలూరుపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం..

Share it:

 



 మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం తూతూమంత్రంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించడం, సమస్యలను గుర్తించడం, శాఖల వారీగా నివేదికలను సమర్పించడం వంటి విషయాలను చట్టం ప్రకారం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్ని శాఖలకు చెందిన అధికారులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. అదే విధంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను, ఇలాంటి సమావేశాలలో అధికారుల దృష్టికి తీసుకు పోవలసి ఉండగా, వారు సైతం కొందరు ఈ సమావేశాలకు హాజరు కాకపోవడం బాధాకరం, హాజరు కాని కొన్ని శాఖల అధికారుల తీరుపై కొందరు ప్రజా ప్రతినిధులు మండల అధికారులను ప్రశ్నించారు.

Share it:

TS

Post A Comment: