CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆత్మ స్థైర్యం తో కూడిన మనో వికాసమే విద్యా లక్ష్యం.

Share it:

 


మన్యం టీవీ మంగపేట 

ధైర్యం,ఆత్మస్థైర్యంతో కూడిన మనో వికాసమే విద్యాలక్ష్యమని ఏ.ఎస్.ఎస్.ఆర్. ప్రభత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు శ్రీ గూళ్ల వెంకటయ్య , శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ఆర్గనైజేషన్ సంస్థ నోడల్ కోఆర్డినేటర్ బైర్ల బాలకృష్ణలు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు వెంకటయ్య ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు జీవిత లక్ష్యాలు, విద్యా ప్రాధాన్యత,నాయకత్వ లక్షణాలు, వంటి అంశాలపై హార్ట్ ఫుల్ నెస్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ కోఆర్డినేటర్ బాలకృష్ణ కళాశాలలో అందుబాటులో ఉన్న డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులకు జీవించు మార్గము, మానసిక స్థితి, లక్ష్య సాధన విధానము, బలాలు, బలహీనతల గుర్తింపు,టైం మానేజ్మెంట్, తల్లిదండ్రుల ప్రాధాన్యత,సమాజం పట్ల పౌరుల బాధ్యత,దేశభక్తి. వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ వెంకటయ్య గారు కోఆర్డినేటర్ బాలకృష్ణను జ్ఞాపిక మరియు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం వై.రేణుకాదేవి,ఎం.సంతోష్ కుమార్,ఎస్. అశోక్, జి.సతీష్ కుమార్,సి హెచ్ శైలేందర్,ఎం.లక్ష్మణ,ఎం.చిరంజీవి,కె. శ్యామ్,టి.నరేష్,నాన్ టీచింగ్ స్టాఫ్ లక్ష్మీ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: