CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు మండలం రామనుజవరం గ్రామంలో గోదావరి లో ఇద్దరు యువకులు గల్లంతు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామనుజవరం వద్ద గోదావరి నదిలో జారీ పడి ఇద్దరు యువకులు చనిపోయారు. యువకులు ఆకుల.సందీప్ (20),కేతన్ మణి కుమార్ లు (20) మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ నివాసిగా గుర్తించారు. గోదావరిలో నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు జారీ నదిలో పడిపోయారు అని స్థానికుల సమాచారం.కొద్ది సేపటికే సందీప్ శవంమై తేలాడు.ఇది గమనించిన స్థానికులు సందీపు ను ఒడ్డుకు తీసుకువచ్చారు.అనంతరం కేతన్ మణి కుమార్ కోసం గజ ఈతగాళ్ళు గాలింపు చేపట్టారు.అతని ఆచూకీ లభించలేదు.ఈ క్రమంలో స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలను ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు బాధిత కుటుంబాలను ఆదుకుంటానని హామి ఇచ్చారు.

Share it:

TS

Post A Comment: