CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అవినీతి కేంద్రాలుగా మారుతున్న ఆశ్రమ పాఠశాలలు...

Share it:



 మన్యంటీవి, అశ్వారావుపేట: పెద్ద వాగు ప్రాజెక్టు ఆశ్రమ పాఠశాలలో మెనూ అమలు కావడం లేదని, శని ఆదివారాల్లో ఎవరి పర్యవేక్షణ లేకుండా విద్యార్థులను నిర్లక్ష్యంగా వదిలేశారని, మీడియాలో కథనాలు ప్రచురితమయి వారం రోజులు గడుస్తున్నా ఎటువంటి ఉన్నతాధికారులు కూడా ఇంతవరకూ పాఠశాల వైపు తిరిగి చూడలేదని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గిరిజనుల విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తూ గిరిజనుల అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని ఒకవైపు ప్రభుత్వాలు ఊదర కొడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం వాటికి భిన్నంగా ఆశ్రమ పాఠశాలలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వాగు ప్రాజెక్టు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెనూ సరిగా అందడం లేదని, అనేక రకాల సమస్యలు వెంటాడుతున్నాయని, పాఠశాల విద్యార్థులను గాలికొదిలేసి ఎటువంటి ఇన్చార్జ్ లను నియమించకుండా శని ఆదివారాల్లో విద్యార్థుల చేతికి తాళాలు అప్పగించి నిర్లక్ష్యంగా వదిలివెళ్లిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పై తగు చర్యలు తీసుకోవాలని మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి ఉన్నతాధికారులు కూడా పాఠశాలను సందర్శించ లేదని, దీనిని బట్టి చూస్తే అధికారుల పర్యవేక్షణ ఆశ్రమ పాఠశాల పై ఎలా ఉందో అర్థమవుతోందని పలువురు చర్చించుకోవడం గమనార్హం. పెద్ద వాగు ప్రాజెక్టు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు గతంలో పెద్దమిడిసీలేరు, రొంపేడు, ఎల్సి రెడ్డిపల్లి, ఆశ్రమ పాఠశాలలో పనిచేసినప్పుడు కూడా ఇటువంటి ఆరోపణల తో క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు పెద్ద వాగు ప్రాజెక్టు ఆశ్రమ పాఠశాలలో కూడా అదే పరిస్థితి దాపురించిందని పలువురు ప్రజలు వాపోతున్నారు. శని ఆదివారాల్లో ఎటువంటి ఇంచార్జ్ లను నియమించకుండా, సోమవారం నాడు అధికారుల చర్యల నుండి బయట పడటం కోసం ఇన్చార్జిను నియమించినట్లు గా ఒక ఉపాధ్యాయుని సంతకాలు తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. గిరిజన విద్యార్థుల సంక్షేమం మరచి అవినీతి కేంద్రాలుగా మారుతున్న ఆశ్రమ పాఠశాలల పై ఉన్నతాధికారులు పర్యవేక్షణతో తగు చర్యలు తీసుకుంటే తప్ప గిరిజన విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని, ఉన్నతాధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: