CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విధులకు హాజరుకాని అంగన్ వాడి టీచర్. .

Share it:

 



 మన్యం మనుగడ వాజేడు. వాజేడు మండలం చింతూరు గ్రామం,లో మూడు నెలలుగా అంగన్వాడి టీచర్, మడప రమణ. గైర్హాజరు అవుతున్నారని, గ్రామస్తులు పై అధికారికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారని, అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు చెప్పాలని అధికారులను పత్రికా ముఖంగా గ్రామస్తులు ప్రశ్నించారు. ఏజెన్సీ లో మారుమూల ప్రాంతమైన చింతూరు అంగన్వాడి కేంద్రాలో, 15 మంది పిల్లలకు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు మూడు నెలల నుండి పౌష్టిక ఆహారం అందడం లేదని వాపోతున్నారు. భారత దేశంలోని బాల బాలికలకు, గర్బవతులకు ముఖ్యంగా పేద వారి పిల్లలకు, పేద మహిళలకు పుష్టికరమైన ఆహారము సంపూర్ణ ఆహారము అందటంలేదని, వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము, ఆంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ఆంగన్‌వాడీ కేంద్రం సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వం కొంత వాటా, రాష్ట్రప్రభుత్వం కొంత వాటా కలిపి, జీతంగా ఇస్తారు. కానీ నీ విధులు నిర్వహించని అంగన్వాడీ కేంద్రాల టీచర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో బి మల్లి రాణి ప్రమీల రమాదేవి ప్రసన్న లక్ష్మి సమ్మక్క సుమలత గీత వినీత కుమారి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: