CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ఎస్ ఎఫ్ ఐ 52వ ఆవిర్భావ వేడుకలు.ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం, జెండా ఆవిష్కరణ...

Share it:

 



 


మన్యం టివి దుమ్మగూడెం:

 భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఎస్ ఎఫ్ ఐ 52వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం మండల కార్యదర్శి కారం సందీప్ అధ్యక్షత నా జరిగింది. డివైఎఫ్ఐ మండల అద్యక్షుడు గుడ్ల సాయి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ అనంతరం మాట్లాడుతూ 1970 డిసెంబర్ ,30 ,31 వ తారీఖున భారత విద్యార్థి ఫెడరేష రాష్ట్ర రాజధాని త్రివేంద్రం లో స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం సోషలిజం ఆశయాలుగా అధ్యాయనం, పోరాటం అను నినాదాలతో ఏర్పడింది .అని అన్నారు. 5 దశాబ్దాలుగా ఎన్నో నిర్బంధాలను ఎన్నో అటుపోటుల్ని ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ అనేక మంది కార్యకర్తలు నాయకులు ప్రాణాలను త్యాగం చేసిన నిలబెట్టుకున్న జెండా, అజెండాను భుజం మీద మూసుకుంటూ ఎన్నో ఆటుపోట్లను ఎన్నో కష్టాలు పడి ప్రాణం పోయినా పర్వాలేదు విద్యార్థుల సమస్యల మీద సమరశీల పోరాటాలు కొనసాగిస్తామని మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం, అనే లక్ష్యం కోసం చదువుతూ, పోరాడు చదువు కై పోరాడు ,అనే నినాదంతో వాటి లక్ష్య సాధనకై పోరాడుతామని శాస్త్రీయమైన విద్యా విధానం కోసం నిరంతరం పోరాడుతుందని వారు తెలియజేశారు.

చదువుతున్న ప్రతి యొక్క విద్యార్థి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.   

ఈ కార్యక్రమంలో జయరామ్, సాయి కృష్ణ, తరుణ్ ., పూజ ,వైష్ణవి అలేఖ్య , వంశీ, శ్రవణ్ ,సందీప్. మరియు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: