CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

షెడ్యూల్ ఏరియా లో ఆర్టికల్ 317 ని రద్దు చేయాలని ఈనెల 27 న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి--:తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్.

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

5 వ షెడ్యూల్ ప్రాంతం లో రాజ్యాంగ వ్యతిరేకంగ అమలు చేస్తున్న జీవో నెంబర్ 317 ని ప్రభత్వం వెంటనే విరమించుకొని షెడ్యూల్ ప్రాంత హక్కులను కాపాడాలని దీనిపై సర్వ అధికారాలు గల గవర్నర్ నిర్ణయం తీసుకొని రక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమీతి తుడుండెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా తల పెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని శనివారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ పిలుపునిచారు.దీనిపై వివిధ సంఘాలు స్పందించి బంద్ లో స్వచ్చందంగా పాల్గొని ఆదివాసీ జాతి మనుగడను కాపాడుకుందాం అని విజ్ఞప్తి చేసారు1976 లో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్ధ ఏర్పాటు చేసినపుడు అందులో చాలా స్పష్టంగా సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ విధానాలు రూపొందించారని అన్నారు. దాని ప్రకారం షెడ్యూల్ ప్రాంతములో జనరల్ జీవో లు చెల్లవని అన్నారు.షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వం కూడా నాన్ ట్రైబల్ గా పరిగణించి పరిపాలన చేయాలని సమత వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం జిల్లా కలెక్టర్ లకు జోనల్ వ్యవస్థ పేరిట బదిలీ చేసే అధికారం లేదని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతి రేఖ పాలన చెస్తున్నదనీ అరుణ్ కుమార్ అన్నారు.షెడ్యూల్ ప్రాంతములో వాణిజ్య సంస్థలు,పాఠశాలలు స్వచ్చందంగా బంద్ చేయాలని అన్నారు.ప్రతి గుడెంలో యువత బంద్లో పాల్గొనాలని అన్నారు.శాంతి యూత పద్ధతిలో బంద్ చేపట్టనున్నట్లు అయన తెలిపారు.ఈ కార్య క్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ని బెల్లీ గణేష్,జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి ప్రకాష్,మండల అధ్యక్షలు ఈసం రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: