CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డిసెంబర్ 26 న ఇల్లందులో జరుగు ఐ ఎఫ్ టి యు జిల్లా జనరల్ బాడీని జయప్రదం చేయండి.

Share it:

 


మన్యం టీవీ న్యూస్ : జూలూరుపాడు, డిసెంబర్ 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, డిసెంబర్ 26న ఇల్లందు లో జరుగు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ జనరల్ బాడీని జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు ఏదులాపురం గోపాలరావు కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోపాలరావు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు అమలు, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంలో వైఫల్యం చెందాయని విమర్శించారు. డిసెంబర్ 26న జరిగే జిల్లా జనరల్ బాడీలో కార్మిక సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, జిల్లా నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున జిల్లాలోని కార్మికవర్గం అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐ ఎఫ్ టి యు నాయకులు కుంచం జమలయ్య, ఓర్సు శ్రీను, బత్తుల కళావతి, కుంచం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: