CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 20వ తేదీన ధర్నాకు టిఆర్ఎస్ పిలుపు.

Share it:



  • తెలంగాణ లో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని తెలంగాణ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మణుగూరు ఎంపీపీ కారం.విజయకుమారి,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ పొశం.నర్సింహారావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి,15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది అని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల కు మాత్రమే అనుమతి ఇచ్చింది అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని,ఇంకా రైతుల దగ్గర ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా,రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్నాలో భాగంగా ఈనెల 20వ తారీకు మణుగూరు మండలం లోని అన్ని గ్రామ పంచాయతీల ఆఫీస్ ముందు ధర్నా చేయాలని టిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది అన్నారు.ఈ ధర్నా కార్యక్రమానికి ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని,బిజెపి పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ చేసే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయ కుమారి, జడ్పిటిసి పొశం. నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,మండల కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్,అధికారిక ప్రతినిధి మేకల.రవి,నాయకులు బాబీజాన్,రామారావు,తాత రమణ,వేముల.లక్ష్మయ్య,యువజన నాయకులు బోశెట్టి.రవి ప్రసాద్,గుర్రం.సృజన్,కె.అప్పారావు,మాదాడి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: