CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

Share it:

 


ఏటూరు నాగారం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగుర వేసిన మండల అధ్యక్షులు చిటమట రఘు,ముఖ్య అతిథులుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ హాజరైనారు.

భారత దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రజల కోసం ఆరాట పడింది కాంగ్రెస్.

ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎస్సీ,ఎస్టీ,బిసి, మైనార్టీల అభ్యున్నతికి ఆరాటపడింది కాంగ్రెస్ పార్టీ.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏఐసీసీ,టీపీసీసీ ఆదేశాల మేరకు ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క పిలుపు మేరకు,నల్లెల కుమారస్వామి సూచన మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో 137వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు హాజరై జెండాను ఎగుర వేశారు.మాట్లాడుతూ 137వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి హాజరైన నాయకులు మాట్లాడుతూ..ముఖ్యంగా 1884 లో ఒక బ్రిటిషర్ అయిన అలన్ ఆక్టావియాన్ హ్యూమ్ అనే వ్యక్తి దేశ ప్రయోజనాల కోసం ఇండియన్ నేషనల్ యూనియనుగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ 137 యేండ్ల నుండి భారత దేశం మీద ఇంత ప్రభావం చూపుతుందని ఎవరు అనుకోలేదు.భారత దేశ ప్రజలందరిని ఒక తాటి మీదకి తెచ్చి స్వాతంత్య్రం తెచ్చుకో వాలనే కాంక్షతో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28 న దాదాబాయి నౌరోజీ చేతుల మీదుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా పేరు మార్చడం జరిగిందని,అసలు ఏక ఛత్రాధిపత్యం వహించిన ఏకైక పార్టీ,స్వాతంత్య్రం రాక ముందు బ్రిటీషుల దగ్గరి నుండి స్వాతంత్య్రం తీసుకు రావడానికి సరైన వేదిక లేక దిక్కు తోచని స్థితిలో,ఆసేతు హిమాచలాన్ని సైతం ఒక తాటి మీదకి తెచ్చి,భారతీయుడి నర,నరాన ఉద్యమ స్ఫూర్తి తీసుకు వచ్చిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.వందల సంవత్సరాల బానిస సంకెళ్లను తెంపి, 

ఓమహోజ్వల ఘట్టానికి తెరలేపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి,ఆరు దశకాల పాటు పోరాటం సాగించి భారత మాత నుదిటి మీద స్వాతంత్య్ర తిలకం దిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వాతంత్రం సిద్దించాక ఏడు దశాబ్దాలు నవ భారతానికి అడుగులు వేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని,అలా ఆవిర్భావం నుండి భారతదేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పు సత్యాగ్రహం,క్విట్ ఇండియా ఉద్యమం,వందేమాతరం ఉద్యమం,సహాయ నిరాకరణ ఉద్యమాలతో బ్రిటీషులపై ఒత్తిడి తెచ్చి1947 లో స్వరాజ్యాన్ని సాధించి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు.గోపాల కృష్ణ గోఖలే,బాలగంగాధర్ తిలక్ తో రెండు బాగాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ 1919వ సంవత్సరంలో మహాత్ముడి రాకతో,కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక అందరిని ఒక తాటి మీదకి తెచ్చాడని,ఆ ఘనత మహాత్ముడికే చెందుతుందని అన్నారు.అసలు కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశ చరిత్ర లేదు.అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే రాజకీయమే లేదని కాంగ్రెస్ పార్టీని కీర్తిని కొనియాడారు.అసలు భారత దేశ మహోజ్వల భవిష్యత్తుకు బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీ అని,తొలి ప్రధానిగా హస్తినలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన జవహర్ లాల్ నెహ్రు తను కలలు కన్నా భారతావని నిర్మించడంలో సఫలమై భారత దేశ రాజకీయ చరిత్రను నెలకొల్పిన మహా ఘనుడు అని అన్నారు.ఇతను దేశానికి పంచ వర్ష ప్రణాళికలు, ఆనకట్టల మరియు ఆయాకట్టల నిర్మాణానికి పునాదులు వేసి దేశ భవిష్యత్తును మరో అడుగు ముందుకు వేయించి ప్రపంచ శాంతికి కూడా బాటలు వేసాడని వారిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 1947 లో దేశ విభజన,కాశ్మీర్ యుద్ధం1962 లో చైనాయుద్ధం నెహ్రు ధృడ సంకల్పాన్ని కించిత్తు కూడా కదిలించలేక పోయాయని17 ఏండ్లు పాలించిన నెహ్రూ అభినవ భారతాన్ని నిర్మించడంలో జాతికే మార్గదర్శకుడు అయ్యాడు అని కితాబిచ్చారు.అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దేశానికి వెన్నుముక అయిన రైతన్నను వ్యవసాయ చట్టాల పేరుతో మోసం చేస్తున్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగికి వరివేయొద్దని,చిరు ధాన్యాల పంటలు మాత్రమే పెట్టాలని,ప్రభుత్వం చిరు ధాన్యాలు పెడితేనే రైతుబంధు ఇస్తానని రైతులకు ఆంక్షలు విధించి,ఇప్పుడేమో అసలు ధాన్యమును కొనడం లేదని యాసంగి పంట ను కూడా బంద్ చేసిందని ఏరోజైనా పాలకపక్షం లో ఉన్న రాజకీయ పార్టీలు రోడ్డు మీదికి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ పరిపాలన చేతగాక ఇలా దిగజారు తుందని అన్నారు.అలాగే భారత దేశం కోసం ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ,వారి ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సోనియా గాంధీ,రాహుల్ గాంధీ కుటుంబానిదని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి

 భారత దేశ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా వారి కుటుంబానికి రుణపడి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్సవడ్ల వెంకన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్ అధ్వర్యంలో ఈ సీనియర్ నాయకులను సన్మానించారు. కూనూరు కృష్ణ,తాళ్లపల్లి వెంకటస్వామి,ఎండిఅబ్దుల్లా,

ఎండి నజీర్,వావిలాల నర్సింగరావులకు సీనియర్లకు పార్టీ ఆవిర్భావం రోజున సన్మానించడం శుభ పరిణామమని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,మండల ఉపాధ్యక్షుడు రియాజ్ జియా,

 జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,జిల్లా మైనార్టీ కార్యదర్శి ఎండి సులేమాన్, ముక్కెర లాలయ్య,మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కె బాబా,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీధర్ ఏటూరునాగారం టౌన్ అధ్యక్షుడు తాళ్లపల్లి నరేందర్, లాల్ మొహమ్మద్ సర్దార్, ప్రసాద్, చిక్కుల మానస,

పడిదల హనుమంతు,

సాధన పల్లి లక్ష్మయ్య, 

మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్,గార మహేష్ పాండ్య రాజేష్,యాకూబ్ పాషా,గద్దల సత్యనారాయణ, చింతకింది రాజు,ఈసం జనార్ధన్,కావేరి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: