CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేట తహశీల్దార్ ను సస్పెండ్ చేయాలంటూ దళితుల నిరసన దీక్ష-మా భూమిని ఆంద్రా వాళ్లకు కట్టపెడుతున్నారంటూ ఆందోళనకోర్టు ఆర్డర్లను సైతం లెక్క చేయడం లేదని ఆవేదన.-1228 సర్వే నెంబర్లలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్.

Share it: మన్యంటీవి, అశ్వారావుపేట: దళితుల భూ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, దళితుల భూములను అక్రమంగా ఆంధ్ర భూస్వాములకు కట్టబెడుతున్నారని, దళితుల మైన మమ్ములను తహశీల్దార్ కార్యాలయంకు రావద్దని, కోర్టులో తేల్చుకోండంటూ మమ్ములను అసహ్యించుకుంటున్నారని, ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, దళితులమైన మాకు రక్షణ కల్పించాలని అశ్వారావుపేటకు చెందిన గుర్రాల శ్రీనివాస్, గుర్రాల దుర్గారావు, గుర్రాలు జయరాజు సంబంధించిన కుటుంబీకులు మరియు మరికొంత మంది పేదలు అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు గుర్రాల శ్రీను మాట్లాడుతూ అశ్వరావుపేట పరిధిలోని 1228 సర్వేనెంబర్ లో 15 ఎకరాల భూమికి గుర్రాల ముత్తయ్య పేరుతో వారసులుగా హక్కులు కలిగి ఉన్నామని ఇటు భూమి గుర్రాల దుర్గయ్య, గుర్రాల జయరాజు, గుర్రాల శ్రీనివాసరావు తాతల కాలంనుండి హక్కు పత్రాలు కలిగి ఉన్నామని వాటి ఆధారంగా వ్యవసాయం చేసుకుంటూ అదే పొలంలో ఇల్లు నిర్మించుకుని నివాసం కూడా ఉన్నామని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పట్టాదారు పాసు పుస్తకాల కోసం తహశీల్దార్ లను అభ్యర్థించినప్పటికీ కొత్త పట్టాలు ఇవ్వలేదని, ఇది భూమిని ఇప్పుడు ఆంద్రా ప్రాంతం కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం కు చెందిన వ్యక్తులకు హక్కు పత్రాలు కల్పించేందుకు ప్రస్తుత తహశీల్దార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని, ఎన్నో సంవత్సరాల నుండి నెత్తి నోరు మొత్తుకొని చెబుతున్నా తహశీల్దార్ మా మాట వినే పరిస్థితి లేదని,1228 సర్వే నెంబర్ గల భూమి అసైన్మెంట్ భూమి అని ఇటువంటి అసైన్మెంట్ భూమి అమ్మడానికి కొనటానికి కూడా వీలు లేదని, అటువంటి భూమిని మా తాతల కాలం నుండి పోడు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ అనుభవిస్తూ వస్తున్నామని, ఇట్టి భూమిని మా వద్ద నుంచి బలవంతంగా లాగేసి ఆంధ్ర ప్రాంతం వారికి కట్టబెడుతున్నారని, అడ్డు వెళ్లిన మాపై, మా కుటుంబ సభ్యుల పై తప్పుడు కేసులు పెడుతూ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని వారు ఆరోపించారు. హైకోర్టు నుంచి ఆర్డర్ లు సైతం తీసుకు వచ్చినప్పటికీ తహశీల్దార్ వాటిని పట్టించుకోవడం లేదని, భూస్వాముల కొమ్ము కాస్తూ దళితుల పట్ల వివక్ష చూపుతూ తప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తూ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. అశ్వారావుపేట తహసిల్దార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దళితులమైన మమ్ములను తాసిల్దార్ కార్యాలయం రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని, న్యాయం అడిగినందుకు ఇప్పటికీ మా పై 15 కేసులు పెట్టించారని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట రెవెన్యూ పరిధిలోని పేట మాలపల్లి పేరాయి గూడెం దోచుకుంటా దళితుల భూములు అన్యాక్రాంత రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.1228 సర్వేనెంబర్ లోని అన్యాక్రాంతం కాబడిన 2600 ఎకరాల దళిత భూములపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి దళితులకు భూముల అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తగరం రాంబాబు, నార్లపాటి సత్యం మాట్లాడుతూ దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దళితుల భూములను అక్రమంగా వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నాలను వెంటనే నిలుపుదల చేయాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట రెవెన్యూ పరిధిలోని పేటమాలపల్లి, దొంతికుంట, పేరాయి గూడెం గ్రామస్తులు పాల్గొన్నారు. నిరసన దీక్ష చేస్తున్న సమయంలో రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ సుచరిత, ఆర్ ఐ లు వెంకటేశ్వరరావు, అనిల్ లు నిరసన దీక్ష చేస్తున్న వారిని, తహశీల్దార్ కార్యాలయం కు వచ్చి మీ రికార్డులు మీరే స్వయంగా పరిశీలించుకోవచ్చని, నచ్చకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని, కోవిడ్ నిబంధనలలో లో భాగంగా ఇలా దీక్షలు చేయకూడదంటూ వారించే ప్రయత్నం చేయగా, అనేకసార్లు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ మమ్ములను పట్టించుకోకుండా, మా భూములను వేరేవారికి కట్ట పెడుతుంటే వచ్చిన మా పై పోలీసు కేసులు పెట్టిన మీరు దీక్షలు చేస్తుంటే ఈరోజు ఇలా మాట్లాడటం సబబు కాదని, మా భూములు మాకు ఇప్పించాలని పేటమాలపల్లి దళితులు అధికారలనుద్దేశించి మాట్లాడారు.

Share it:

TS

Post A Comment: