CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహనా అవసరం--:మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

సైబర్ నేరాలపై ప్రతి ఇక్కరికి అవగాహనా అవసరం. అప్పుడే ఇటువంటి నేరాలను ఆదిలోనే గుర్తించి అరికట్టవచ్చు. రాజుపేట జడ్పీ ఎస్ స్కూల్ లో మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా ఆధ్వర్యంలో జరిగిన అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఐ తాహెర్ బాబా మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.2021నేషనల్ క్రైమ్ రికార్డుల ఆధారంగా 17శాతం సాధారణ నేరాలుంటే సోషల్ మీడియా ఆన్ లైన్ నేరాలు 24 శాతం,59శాతం ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని అన్నారు. నేరం జరిగిన వెంటనే భాదితులు పిర్యాదు చేయక పోవడం వల్లే సైబర్ నేరగాళ్ళు చెలరేగి పోతున్నరన్నారు. సైబర్ నేరానికి గురైన తక్షణమే పోలీస్ లకు పిర్యాదు చేయాలనీ సూచించారు.2017-19 మద్య కాలంలో 93 వేల సైబర్ నేరాలు జరిగితే వీటిలో మోసాలు, లైంగిక వేదింపుల కేసులే అధికంగా ఉన్నాయని , సైబర్ నేరాలు ద్వారా దేశ ప్రజలు 1.25 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని వివరించారు. విద్యార్థిని విద్యార్థులు అప్రమత్తం కావాలని అధికంగా మొబైల్స్ వినియోగించడం, అపరిచితులతో మాట్లాడటం, సోషల్ మీడియా పట్ల కూడా జాగ్రత్త గా ఉండాలని మీరు తెలిసో తెలియక చేసే చిన్న తప్పిదం మీ భవిష్యత్ ను నాశనం చేస్తుంది అందుకే మొబైల్ వీలైనంత తక్కువగా వినియోగం చేయాలి చదువు మీద ద్రుష్టి పెట్టి ఒక లక్ష్యం తో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా, పీసీ శ్రీనివాస్, జడ్పి ఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మంజుల, సీనియర్ ఉపాధ్యాయులు జ్యోతి తోటి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: