CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు వ్యతిరేక చట్టాల రద్దు రైతాంగపోరాట విజయం రైతు సోదరులకు జేజేలు: న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ

Share it:




మన్యం టీవీ మణుగూరు:


3 వ్యవసాయ నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడం రైతాంగ పోరాట విజయమని న్యాయమైన పోరాటాలకు ఎంతటి వారైనా తల వంచక తప్పదని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి అన్నారు.శుక్రవారం మణుగూరులో అఖిలభారత రైతు కూలీ సంఘం కార్యకర్తల తో జరిగిన సమావేశంలో మోర రవి మాట్లాడుతూ,రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం,ఈ సంవత్సర కాలం నుండి వీరోచితంగా పోరాడిన రైతాంగానికి జేజేలు తెలిపారు. సంవత్సర కాలంగా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ,భీష్మించుకు కూర్చున్నా,రైతాంగం అంకుటిత దీక్షతో ఉద్యమాన్ని కొనసాగించిందని,ఉద్యమ ఫలితంగానే చరిత్రలో నిలిచిపోయే విజయం లభించిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళుతెరిచి వ్యవసాయ రంగంలోని సంక్షోభాన్ని,నష్టాలను నివారించడానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని,కనీస మద్దతు ధరలకై చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.రైతులు సాధించిన ఈ విజయంతో,దేశ కార్మిక కర్షక వర్గం తమ హక్కులకై పోరాటం చేయాలన్నారు.పోరాటాల ద్వారానే తమ తమ హక్కులను సాధించగలమని, భారత రైతాంగం, నిరూపించిందని తెలిపారు.ఈ ఉద్యమంలో ఎందరి ప్రాణాలు పోయినా,లక్షలాది రైతు సోదరులు పోరాటంలో పాల్గొని చిరస్మరణీయమైన విజయం సాధించారని పేర్కొన్నారు.రైతే దేశానికి వెన్నుముఖ అని, అందరికీ అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకునే దుస్థితి మన దేశంలో నిర్మూలించబడాలంటే,ప్రభుత్వాలు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ,రైతులను ప్రోత్సహించాలన్నారు.రైతు చట్టాల రద్దుకై పోరాటంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి విప్లవ జేజేలు తెలిపారు.ఈ ఉద్యమ స్పూర్తితో మరిన్ని పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతాంగానికి విప్లవ  అభినందనలు తెలిపారు.ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి దుబ్బాక.జగ్గన్న, చిన్నబోయిన.గంగరాజు సూర్యం.రామకృష్ణ,సూరమ్మ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: