CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలి.--:వికాస్ ఆగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీమతి స్నేహలత.

Share it:

 *



 


  •  వికాస్ మగ్గం వర్క్స్ బోటిక్ మరియు టెక్స్ టైల్స్  ప్రారంభం.

మన్యం టీవీ మంగపేట.

మహిళలు ఆర్థిక స్వావలంబన మహిళా సాధికారిత దిశగా అడుగులు వేయాలని వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీమతి నాసిరెడ్డి స్నేహలత  అన్నారు మంగళవారం పినపాక మండలం  జానంపేట గ్రామంలో వికాస్ మగ్గం వర్క్స్ బోటిక్ మరియు టెక్స్ టైల్స్ వ్యాపార సముదాయాన్ని  బేబీ గగనశోభితతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీమతి స్నేహలత రెడ్డి మాట్లాడుతూ  సూక్ష్మ మరియు లఘు పరిశ్రమల స్థాపన మరియు  వ్యాపార వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించాలని ఆకాంక్షించారు ఈ ప్రాంతంలోని టైలరింగ్ చేస్తున్న మహిళలు అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చి వారికి కామన్ ఫెసిలిటీ సెంటర్ స్థాపించి సేవలందించేందుకు యోచిస్తున్నామని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సైతం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు మంగపేట పినపాక మండలాల్లోని ఆసక్తి కలిగిన హౌత్సాహిక మహిళలకు త్వరలోనే ప్రత్యేక కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల అభిరుచులకు తగినట్లుగా వస్త్ర తయారీ డిజైనింగ్  మగ్గం వర్క్స్ ఎంబ్రాయిడింగ్ పాలీసింగ్  డ్రై క్లీనింగ్  రోలింగ్ వంటి సకల సదుపాయాలు ఒకే దగ్గర అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు స్థానికంగా  మహిళా బ్యూటీ పార్లర్ సైతం అందుబాటులో ఉండడంతో వివాహాది శుభకార్యాలకు ముఖ్యంగా మహిళలకు అవసరమైన అన్ని సేవలు ఒకే దగ్గర అందుబాటులో ఉన్నాయన్నారు వస్త్ర మన్నికకు నమ్మకంగా  పేద మధ్య తరగతి వర్గాలకు అందుబాటు ధరలలో సేవలు అందించనున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు వెంకటరమణ లక్ష్మీ హరిత  బేబీ ఘగన శోభిత   కవిత సత్య లావణ్య స్వప్న స్వరూపరాణి  పార్వతిదేవి నవ్య అచ్చమ్మ   బ్యూటిషన్ చందర్లపాటి నలిని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: