CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జంపంగవాయి గిరిజన అటవీ హక్కుల కమిటీ ని రద్దు చెయ్యాలి.కొత్త కమిటీ వేయాలి, మరియు పంచాయతీ కార్యదర్శి పై చర్య తీసుకోవాలి.

Share it:

 



మన్యం టీవీ ఏటూరు నాగారం

జంపంగవాయి గ్రామ గిరిజన అటవీ హక్కులు కమిటీ ని రద్దు చేసి,అనర్హులను పెట్టిన  కార్యదర్శి పై చర్య తీసుకోవాలి అని గ్రామస్తులు డిమాండ్ చేశారు.గత నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం ప్రక్కన గ్రామం అయినా జంపంగవాయి గ్రామంలో  సర్పంచ్ గొంది శ్రీధర్ మరియు సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండల ఎంపీపీ గొంది వాణిశ్రీ ల ఆధ్వర్యంలో ఆదివాసీ అటవీ హక్కుల కమిటీ లో స్థానిక ఆదివాసీ లను చైర్మన్ కాదు కదా కనీసం సభ్యులగా కూడా తీసుకోకుండా కొన్ని సంవత్సరం ల క్రితం వేరే జిల్లా నుండి వలస వచ్చిన వారితో కమిటీ వేయడంమే కాకుండా స్థానిక నివాసులకు అన్యాయం చేశారు.దీంతో గ్రామస్తులు ఈరోజు సమావేశం అయ్యారు. అనంతరం గ్రామ పెద్ద పోలేబోయిన మల్లక్క మాట్లాడుతూ పూర్వం నుండి ఉన్నవారికి అవకాశం ఇవ్వకుండా ఆదివాసులను అనగా తొక్కుతూ కొన్ని సంవత్సరంల క్రితం నల్గొండ, జనగామ జిల్లా నుండి వలస వచ్చిన వారిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. కమిటీ ఎన్నికునే సమయంలో పూర్వం నుండి సుమారుగా కొన్ని సంవత్సరాల నుండి  నివసిస్తున్న  ఆదివాసీ లను అవమానించి కమిటీ లో రాకుండా కుట్ర చేశారని ఆరోపించారు.ములుగు జిల్లా రైతు నాయకులు చేర్ప నరసింహులు  మాట్లాడుతూ స్థానికులకు అన్యాయం చేయడం కోసమే ఈ కమిటీ ఎన్నుకున్నారని దీని రద్దు చేసి కొత్త కమిటీ వేయాలని,ఈ కమిటీపై  కలెక్టర్  స్పందించి స్థానిక పంచాయతీ కార్యదర్శి ని తొలగించాలని డిమాండ్ చేశారు.లేకుంటే మేమే కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తాం అని హెచ్చరించారు.ఈ విషయం లో ఆదివాసీ సంఘాలు కూడా మద్దతుగా పోరాటం ఉదృతం చేయాలి అని కోరారు.ఈ కార్యక్రమం కొమరం లక్ష్మన్ రావు, సిద్దబోయిన సమ్మక్క,చందా సత్యక్క,అట్టం శంకరమ్మ, పోలేబోయిన ప్రవీణ్,గుండ్ల దేవేందర్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: