CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాణ్యమైన బొగ్గు రవాణా, ప్రమాదాల నివారణ సింగరేణి సంస్థకు రెండు కళ్ల లాంటివి:పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్ రాముడు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


నాణ్యమైన బొగ్గు రవాణా, ప్రమాదాల నివారణ సింగరేణి సంస్థకు రెండు కళ్ళు లాంటివని కొండాపురం సీఎస్పీ లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి,ఆ దిశగా అప్రమత్తంగా ఉండి పనిచేయాలని,పీకే ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ మాలోత్.రాముడు అన్నారు.పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం కొండాపురం సీఎస్పీ లో జరిగిన *సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ *ఎస్ ఓ పి* ప్రమాదాల నివారణ తో కూడిన బొగ్గు రవాణా అనే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.రక్షణ పనిలో, మదిలో,గదిలో అనే నినాదంతో ప్రతి ఒక్క ఉద్యోగి,రక్షణతో కూడిన బొగ్గు రవాణాకు అనుక్షణం అప్రమత్తంగా ఉండి పనిచేయాలని,ఆయన కోరారు. దీనికై



యాజమాన్యం రూపొందించిన *సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ ఎస్ ఎం పి* మార్గదర్శక సూత్రాలు వెలుగులో నిర్దేశిత పనిస్థలాల్లో, బెల్టుల వద్ద,మోటార్ల వద్ద, ఎత్తుపల్లాల వద్ద,ఎత్తైన ప్రదేశాలలో వ్యాగిన్ లోడింగ్ వద్ద,బంకర్ ల వద్ద,బెల్ట్ క్లీనింగ్ వద్ద,కరెంట్ తో చేసే పని వద్ద, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని,స్వీయ రక్షణ పాటించాలని కోరారు.వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలని, చలికాలం నేపద్యంలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు సమయానికి మందులు వాడాలని, ద్విచక్రవాహనాలపై హెల్మెట్ తప్పకుండా ధరించాలని, ఆయన కార్మికులను కోరారు. అనంతరం అందరితో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పీకే ఓసి రక్షణ అధికారి ఎం లింగబాబు, కేసీఎస్పీ డీజీఎం సురేష్, అధికారులు ఆర్ఎస్ గౌడ, వేణుగోపాల్ రామకృష్ణ,నవీన్ సూపర్వైజర్లు వెంకట్రావు, వెంకట్,రాజు,చంద్రశేఖర్,ఎస్ ఓ పి సమన్వయ కర్త ఎస్డీ.నా సర్ పాషా,భద్రం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: