మన్యం టీవి వెబ్ డెస్క్: చిన్న పిల్లల పుట్టిన రోజు వేడుకలు అంటే హంగు ఆర్భాటం చేసే ఈ రోజుల్లో తన కూతురు పుట్టినరోజు సందర్భంగా నిరుపేద చిన్నారులకు దుస్తులు పంపిణీ చే మానవత్వం చాటుకున్నాడు కర్నె మురళి.విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ని దైవంగా భావించి,ఆయన ప్రేరణ తో తన కూతురు లేఖన నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
వెంకటేశ్వర కాలనీ, కిన్నర స్టెల్, వికలాంగుల కాలనీలకు సంబంధించిన ఉమ్మడి అంగన్వాడీ కేంద్రంలో 15 మంది చిన్నారులకు (చాక్లెట్లు బిస్కెట్లు బదులుగా) నూతన వస్త్రాలను బహూకరించడమైంది. ఈ సందర్భంగా కర్నే మురళి సేవా దృక్పథం వారికి ఆదర్శంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సెక్టార్ సూపర్వైజర్ భవానీ, టీచర్లు కే గున్నమ్మ, ఎస్ రాజేశ్వరి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: